• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డ్రాగన్ దేశానికి నితీశ్...

డ్రాగన్ దేశానికి నితీశ్ అంతలా దెబ్బేయటానికి రీజన్ ఇదే!

By - Tupaki Desk
Update: 2020-06-29 05:00 GMT
యావత్ దేశమంతా తీవ్రమైన భావోద్వేగం నడుస్తోంది. ఓపక్క దేశ ప్రజలంతా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. చైనా తీరుపై తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమను కెలికిన చైనా సైనికులకు మన సైనికులు దిమ్మ తిరిగేలా షాకిచ్చినా.. ఆ క్రమంలో ఇరవైమంది వరకూ ప్రాణాలు కోల్పోవటం భారతీయులకు మింగుడుపడని పరిస్థితి. దాదాపు నలభై మంది వరకూ డ్రాగన్ సైనికులను ముట్టు పెట్టి.. మీరు ఒకటిస్తే.. మేం రెండు ఇవ్వగలమన్న సందేశాన్ని మన వీర సైనికులు ఇచ్చారని చెప్పాలి.

గాల్వామా ఉదంతం నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు.. చైనాతో కాంటాక్టుకు చెల్లుచీటి ఇచ్చేశారు. తాజాగా అదే బాటలో నడిచారు బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. తన రాష్ట్ర రాజధాని పాట్నాలో నిర్మించాల్సిన మహాత్మాగాంధీ వంతెనకు గతంలో ఇచ్చిన కాంటాక్టును రద్దు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టర్ కు చైనాకు చెందిన రెండు కంపెనీలతో లింకులు ఉండటంతో ఇంత తీవ్ర నిర్ణయాన్ని తీసుకోవటానికి ఆయన వెనుకాడలేదు.

తమ టెండర్లు కావలాంటే చైనా కంపెనీతో తెగ తెంపులు చేసుకోవాలన్న మాటను చెప్పినప్పటికీ.. సదరు సంస్థ తన తీరును మార్చుకోకపోవటంతో.. వారికివ్వాల్సిన టెండర్లను రద్దు చేసినట్లుగా తాజాగా ప్రకటించిన అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు.

ఇంతకీ చైనా బలగాలు చేసిన దాడిపై మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రుల కంటే నితీశ్ అంత ఘాటుగా ఎందుకు రియాక్టు అయినట్లు? అన్న సందేహం కలిగిందా? అక్కడికే వస్తున్నాం. చైనా చేసిన దుర్మార్గపు దాడిలో మరణించిన సైనికుల్లో ఐదుగురు బిహార్ రాష్ట్రానికి చెందిన వారు కావటంతో నితీశ్ కు తీవ్రమైన కోపం వచ్చింది. తన తాజా నిర్ణయంతో డ్రాగన్ దేశానికి చురుకు పుట్టించేలా చేయటమే ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో చైనాకు షాకిచ్చే నిర్ణయంతో రాష్ట్ర ప్రజల మనసుల్ని దోచేశారని చెప్పక తప్పదు.
Tags:    
  • Nitish Kumar Yadav 
  • Bihar 
  • Boycott China products 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

Copyright @2026

Powered by Blink CMS