బీహార్ లో చిరాగ్ డేంజరస్ గేమ్ ప్లాన్ వర్కవుటవుతుందా?

Update: 2020-10-12 17:30 GMT
మరో మూడు వారాల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ చాలా డేంజరస్ గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. వారం క్రిందట చిరాగ్ తండ్రి, కేంద్ర మాజీమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంచిన విషయం అందరికీ తెలిసిందే. బీహార్ రాష్ట్రంలో రామ్ విలాస్ కు తిరుగులేని ఇమేజి ఉంది. ఇందువల్లే వరుసగా 8 సార్లు లోక్ సభకు ఎన్నికవుతునే ఉన్నారు. ఇదే సమయంలో దళితుల ఆశాజ్యోతిగా రామ్ విలాస్ చాలా పాపులారిటి సంపాదించారు. అయితే రామ్ విలాస్ సంపాదించుకున్న పాపులారిటీలో యూపీఏ కూటమి  ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాత్రకూడా ఉంది. అయితే వివిధ కారణాల వల్ల నితీష్ కు చిరాగ్ తో విభేదాలొచ్చాయి.

ఇదే సమయంలో రామ్ విలాస్ కూడా ఆనారోగ్యంబారిన పడటంతో  రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కొడుకు చిరాగ్ కు అప్పగించేసి రామ్ విలాస్ దాదాపు ఢిల్లీకే పరిమితమైపోయారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో పార్టీ వ్యవహారాలు మొత్తం చిరాగే చూసుకుంటున్నారు. ఇటువంటి సమయంలోనే నితీఫ్ తో విభేదాలు పెరిగిపోయి సయోధ్యకు ప్రయత్నించే క్రమంలోనే తండ్రి ఆసుపత్రిలో చేరారు. చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉండి చివరకు చనిపోయారు. దాంతో నితీష్-చిరాగ్ మధ్య సయోధ్య చేసే వారు లేకపోయారు. ఇదే సమయంలో ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న కారణంతో కూటమిలో నుండి బయటకు వచ్చేసి తమ పార్టీ లోక్ జనతా దళ్ పార్టీ (ఎల్జీపీ) సొంతంగానే పొటో చేస్తుందంటూ చిరాగ్ చేసిన ప్రకటన రాష్ట్రంలో సంచలనమైంది.

సరే మొత్తానికి చిరాగ్ కోరుకుంటున్నట్లుగానే  243 అసెంబ్లీ సీట్లలో ఎల్జేజీ 143 స్ధానాల్లో  పోటీ చేస్తోంది. నిజానికి గడచిన పదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా నితీష్ చాలా వర్గాలపై పట్టు సాధించారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అయితే సిఎంతో చిరాగ్ కు ఎందుకు విభేదాలొచ్చాన్నది మాత్రం అర్ధం కావటం లేదు. సరే ప్రస్తుత విషయం ఏమిటంటే తండ్రి  మరణం తాలూకు సానుభూతిపైనే చిరాగ్ బాగా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో 16 శాతమున్న దళితుల్లో 22 ఉపకులాలున్నాయి. వీళ్ళల్లో నాలుగు ఉపకులాలు ఆర్ధికంగా బాగా గట్టి స్ధితిలో ఉన్నాయి. మిగిలిన 18 ఉపకులాల్లో జనాలు అత్యంత వెనుకబడున్నారు.

దళితుల్లో  తండ్రికున్న పట్టు చిరాగ్ కు లేదన్న మాట వాస్తవం. ఇదే సమయంలో అన్నీ వర్గాలతోను నితీఫ్ కు మంచి  సంబంధాలే ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన చిరాగ్ ఓ డేంజరస్  ప్లాన్ కు తెరలేపారు. అదేమంటే యూపీఏ కూటమిలోని బీజేపీ పోటి చేసే  121 సీట్లలో మెజారిటి స్ధానాల్లో చిరాగ్ తన అభ్యర్ధులను నిలపటం లేదు.  పోటి చేస్తున్న సీట్లలో కూడా పెద్దగా గట్టి అభ్యర్ధులు లేరు. నితీష్ నేతృత్వంలోని జేడీయూ పోటి చేస్తున్న 122 స్ధానాల్లోనే చిరాగ్ గట్టి అభ్యర్ధులను నిలబెట్టారు. అంటే ఒకవైపు యూపీఏ కూటమిలోని నరేంద్రమోడితో సన్నిహిత సంబధాలు మెయిన్ టైన్ చేస్తునే అదే కూటమిలోని నితీష్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

అభ్యర్ధులను పోటిలోకి దింపటంలో చిరాగ్ అనుసరిస్తున్న గేమ్ విషయం పార్టీ నేతల్లో అసంతృప్తిని పెంచేస్తోంది. ఎందుకంటే జేడియూ అభ్యర్ధులపై పోటి చేసే ఎల్జేపీ అభ్యర్ధులందరూ గెలుస్తారని లేదు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్ధుల గెలుపుకోసమని ఎల్జేపీ పోటి చేయిస్తున్న బలహీన అభ్యర్ధులను కాదని యూపీఏ కూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచే అవకాశాలున్నాయి. ఒకేసారి చిరాగ్ అమలు చేస్తున్న డేంజరస్ గేమ్ వికటిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉందని సీనియర్ నేతలు ఆందోళన పడుతున్నారు. అయితే చిరాగ్ మాత్రం ఎవరినీ పట్టిచుకోవటం లేదట. మరి చిరాగ్ డేంజరస్ గేమ్ ఎంత వరకు షలితాలు ఇస్తుందో చూడాల్సిందే.
Tags:    

Similar News