బీహార్ లో బరిలోకి దిగనున్న శివసేన .. ఎన్ని స్థానాల్లో అంటే ?

Update: 2020-10-10 07:15 GMT
బీహార్ ‌లో ఈ నెల లో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో  ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఈ సమయం లోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా పోటీ చేస్తుందని శివసేన  పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. దాదాపు 50 సీట్లలో శివసేన అభ్యర్థులను నిలిపే ఆలోచన చేస్తునట్టు  తెలిపారు. బిహార్ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, మంత్రి ఆదిత్య థాక్రే వర్చువల్ ర్యాలీల్లో పాల్గొంటారని చెప్పారు.

ఇక, బిహార్ ఎన్నికల కోసం శివసేన ఇప్పటికే 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను విడుదల చేసింది. ఉద్దవ్ థాక్రే,ఆదిత్య థాక్రేలతో పాటు రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయి,లోక్ ‌సభ ఎంపీలు కృపాల్ తుమానే, అరవింద్ సావంత్, వినాయక్ రౌత్, మాజీ చంద్రకాంత్ ఖైరే, మంత్రులు గులాబ్ రావ్ పాటిల్, సుభాష్ దేశాయి ఈ జాబితాలో ఉన్నారు.బిహార్ ‌లోనూ పార్టీని విస్తరించాలన్న యోచనలో ఉన్న శివసేన ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది.

సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడంలో కీలక వ్యవహరించి... ఆ తర్వాత జేడీయూ లో చేరిన బిహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే‌ పై కూడా అభ్యర్థిని నిలబెడుతామని శివసేన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ లో అక్టోబర్ 28,నవంబర్ 3,నవంబర్ 7 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఫలితాలు వెలువడుతాయి.
Tags:    

Similar News