• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాయచోటి ఎమ్మెల్యే కి...

రాయచోటి ఎమ్మెల్యే కి పెద్ద షాక్ ?

By - Tupaki Desk
Update: 2020-01-11 07:09 GMT
ఆయన కి  రాజకీయాలలో చాణిక్యుడు అనే పేరు ఉంది. ఏదైనా వ్యూహం పన్నాడు అంటే అది జరిగి తీరాల్సిందే. ఇదే ఆయన్ని రాజకీయాలలో ఇన్నేళ్ళుగా కొనసాగేలా చేసింది. ఓడినా , గెలిచినా నిత్యం ప్రజలతో మమేకమై ఉండటం అయన నైజం. అలాగే తనకి ఓట్లు వేసి గెలిపించిన తన నియోజకవర్గంలోని ప్రజలకి ఎదో ఒకటి మంచి చేయాలని ఆలోచించే తత్త్వం ఆయనిది. అందుకే తాజాగా సీఎం జగన్ చేతులు మీదుగానే నియోజకవర్గాల్లో కొన్ని అభివృద్ధి పనులకి శంకుస్థాపన కూడా చేయించారు. దీనితో నియోజకవర్గంలో అయన పేరు మారుమోగిపోతుంది అని అనుకున్నారు..అందరూ అనుకున్నట్టే ఇప్పుడు అయన పేరు నియోజకవర్గం మొత్తం మారుమోగిపోతుంది. కానీ , ఆయనకి మద్దతుగా కాదు..వ్యతిరేకంగా. కానీ అలాంటిదేంలేదని, ఆయన అంటున్నా, నిరసనలు మాత్రం ఆగడం లేదు. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకు వచ్చిన కొత్త సమస్య ఏంటి? రాయచోటిలో ఎందుకంత రగడ జరుగుతోంది? అంటే

రాయచోటి. కడప జిల్లాలో కరువుకు కేరాఫ్‌గా పేరొందిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గొలుపొందిన నాటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కలియ తిరుగుతూ అభివృద్దికి సంబంధించిన ప్రతిపాదనలతో నిత్యం సిఎం క్యాంపు ఆఫీసు, జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల సీఎం చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయించారు. సిఎం రాకతో నియోజకవర్గంలో అభివృద్ది పరుగులు తీయడంతో పాటు రాజకీయంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి ఎంతగానో క్రెడిట్ దక్కుతుందని ఆశించారు. కానీ ఆయన ఆశించిన దానికి భిన్నంగా ఇప్పుడు రాజకీయంగానే కాకుండా అన్ని వర్గాల నుంచి, శ్రీకాంత్‌కు కొత్త తలనొప్పు మొదలైంది.

రాయచోటి పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన నాలుగు ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల, 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఉన్నత పాఠశాల. ఎంతోమందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దింది. స్వాతంత్య్రానికి ముందే 1930లో ఈ కళాశాలకు, ఆనాడే నాలుగు ఎకరాల విలువైన భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ వంద కోట్లలో ఉంటుంది. అయితే 1998 నుంచి వక్ప్‌ బోర్డు, విద్యాశాఖల మధ్య వివాదం సాగుతోంది. దీంతో సమస్య కాస్త హైకోర్టు కు వెళ్లింది. అయితే, 2019 మార్చిలో గత ప్రభుత్వం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విద్యాశాఖ సెక్రటరీలు ఈ స్థలాన్ని మైనార్టీ సంక్షేమం కోసం వక్ఫ్‌ బోర్డుకు ఇస్తే ఎలాంటి ఇబ్బందిలేదని ఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆ నివేదిక నాడు అమల్లోకి రాకపోయినా, గతనెల 24వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాయచోటిలో జరిగిన వివిధ అబివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూనియర్‌ కళాశాలలో జరిగిన బహిరంగసభ వేదికగా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం జూనియర్‌ కళాశాలకు చెందిన నాలుగు ఎకరాలు వక్ఫ్‌ బోర్డుకు కేటాయిస్తామని, రేపటి నుంచే ఆ పనులు మొదలు పెడతామని ఆ వేదికగా ప్రకటించారు. అందులో భాగంగానే విలువైన కళాశాల స్థలాన్ని వక్ఫ్‌ బోర్డుకు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా రాయచోటిలో ఆందోళనలు, నిరసనలకు తెరలేసింది.

రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ పట్టణంలో ఆందోళనలు, నిరసనలు, మహార్యాలీలు హోరెత్తుతున్నాయి. ఓ వైపు ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు, రాజకీయ పార్టీలు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. అంతేకాకుండా తమ ఎమ్మెల్యే, ప్రభుత్వ ఛీప్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కనపడటం లేదని ప్రజాసంఘాలు, విద్యార్థి జేఏసీ నాయకులు ఇటీవల రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలం నాలుగు ఎకరాల్లో మహిళా డిగ్రీ కళాశాల, పీజీ సెంటరు ఏర్పాటు చేయాలని విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీ, ప్రజలు కొన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. సీఎం చేసిన ఒక్క ప్రకటన తనకు రాజకీయంగా లబ్ది చేకూరుస్తుందనుకుంటే మరింత నష్టాన్ని కలిగించేలా తయారైంది. శ్రీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు నానాటికి తీవ్రమవుతూనే ఉన్నాయి గానీ తగ్గుముఖం పట్టకపోవడంతో, ఆయనకు కూడా ఎటు పాలుపోవడం లేదు. నిత్యం ప్రచార మాధ్యమాల్లో కనిపించే శ్రీకాంత్ రెడ్డి కొద్ది రోజులుగా తెరవెనకే ఉండిపోతున్నారు. చూడాలి మరి శ్రీకాంత్ రెడ్డి ఈ సమస్య నుండి ఎలా బయటపడతారో ...


Tags:    
  • Amaravathi 
  • Amaravathi News 
  • Andhra News 
  • Andhra Politics 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

నారా లోకేష్‌ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..

2026-11-12 18:27 GMT

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

2026-11-12 18:25 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం.. Nvidiaలో ఏం జరగబోతోంది?

2026-11-12 18:19 GMT

కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!

2026-11-12 18:17 GMT

20 ఏళ్ల తర్వాత రాజాంలో ఎన్నికల సందడి.. తొలి పాలకవర్గంపై ఉత్కంఠ!

2026-11-12 17:30 GMT

విజయసాయి పీఆర్పీకి నియోజకవర్గానికి 100 ఓట్లు కూడా కష్టమేనా ?

2026-11-12 17:05 GMT

Copyright @2026

Powered by Blink CMS