'బిన్ లాడెన్'నే ఏరివేశాం.. ఆఫ్ఘన్ సంక్షోభంపై స్పందించిన జో బైడెన్

Update: 2021-08-21 07:00 GMT
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం పై అగ్రరాజ్యం అమెరికా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. మాట తూలకుండా , ఓ మాట మాట్లాడే ముందు ఒకటికి వంద సార్లు అలోచించి మాట్లాడుతుంది. తాజాగా ప్రపంచంలో ఉగ్రవాదం ఏ మూలన ఉన్న సహించబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. ఆప్ఘనిస్తాన్‌ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న అమెరికా పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తామని ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌ లో ఇంత వేగంగా పతనం సాధ్యమని ఎన్నడూ చెప్పలేదని జైడెన్, తాలిబన్లు కాబూల్‌ ని అధిగమిస్తారన్న వార్తలను ఆయన ఖండించారు.

అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న కొద్ది కాలంలోనే తాలిబన్లు ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పష్టత ఇచ్చిన బైడెన్, ప్రస్తుతం అప్ఘాన్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా మహిళల పై జరుగుతున్న ఆరాచకాలను ఉపాధ్యక్షుడు కమలా హారిస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదాన్ని స‌హించ‌బోమ‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇప్పటికే అమెరిక‌న్ల త‌ర‌లింపు ప్రారంభం ఆయ్యిందని అన్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్ నుండి 13 వేల మందిని తరలించినట్లు బైడెన్ ప్రకటించారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ఆఫ్ఘన్ నుంచి అమెరిక‌న్లను త‌ర‌లించ‌డం అంత తేలిక కాద‌న్న ఆయన.. ఈ ప్రక్రియ అత్యంత ప్రమాద‌క‌ర‌మ‌ని కామెంట్ చేశారు. అయినా, అమెరిక‌న్లను సుర‌క్షితంగా స్వదేశానికి త‌ర‌లిస్తామ‌ని స్పష్టం చేశారు. అమెరిక‌న్ల భ‌ద్రతే త‌మ‌కు ప్రధాన‌మ‌ని ప్రకటించారు. ఈ క్రమంలో ఇదే విషయంపై తాలిబ‌న్లతో చ‌ర్చిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. అమెరిక‌న్లను త‌ర‌లించ‌డానికి ఆఫ్ఘనిస్తాన్‌ కు మ‌రిన్ని విమానాలు పంపిస్తామని వెల్లడించారు.

ఇదే సమయంలో తమ దేశ పౌరుల‌పై హింస‌ను స‌హించ‌బోమ‌ని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో వారం రోజులుగా క‌నిపిస్తున్న దృశ్యాలు హృద‌య విదార‌కంగా ఉన్నాయ‌న్న అమెరికా అధ్యక్షుడు, ప‌రిస్థితిపై వ‌చ్చేవారం జీ-7 దేశాల కూట‌మి చ‌ర్చిస్తుంద‌ని వివ‌రించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని స‌హించబోమంటూ, తాలిబ‌న్లకు వార్నింగ్‌ ఇచ్చారు. ఆల్ ఖైదా వ్యవ‌స్థాప‌కుడు బిన్ లాడెన్ వంటి వారినే ఏరివేశామ‌న్న బైడెన్‌, కాబూల్ విమానాశ్రయం ఆరువేల మంది అమెరికా సైనికుల ప‌హారాలో ఉందని వివరించారు.

తాలిబన్లపై అప్ఘాన్ ప్రభుత్వం అసలు పోరాడలేదన్నారు. చేతులు కట్టుకుని పాలనను వారికి అందించినందని మండిపడ్డారు. అయితే ప్రస్తుత పరిస్థితులకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలే కారణమని అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. అప్ఘాన్ సంక్షోభానికి ట్రంప్ వైఖరే కారణమన్నారు. తీవ్రవాదానికి తాము ఎప్పుడూ వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చేసింది ముమ్మటికి తప్పేనని జో బైడెన్ అన్నారు. అప్ఘాన్‌లో నాలుగు పర్యటించానని గుర్తు చేశారు. ఆ దేశం వల్ల ఇప్పటివరకు అమెరికా సైన్యానికే తీవ్ర నష్టం జరిగింది. భవిష్యత్‌లో అమెరికాకు ఏది మంచిదో దానిపైనే దృష్టి పెడతానన్నారు


Tags:    

Similar News