వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా రాన్ ..బైడెన్ తోలి నిర్ణయం !

Update: 2020-11-12 08:50 GMT
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ వైట్ హౌస్ లో తన చిరకాల ఆప్తుడు రాన్ క్లెయిన్ ని చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించారు. తన అధికారిక హోదాలో ఆయన ఈ నియామకం చేయడం ఇదే  తొలిసారి. గత  సంవత్సరాలుగా తాము కలిసి పని చేశామని, అపారమైన రాన్ అనుభవం, సేవా నిరతి తనను ఆకట్టుకున్నాయని బైడెన్ అన్నారు. 2009 లో రాన్ అమెరికా ఉపాధ్యక్షునిగా  వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  అలాగే , 2014 లో బరాక్ ఒబామా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఎబోలా క్రైసిస్ అదుపునకు రాన్… వైట్ హౌస్ కి, అధికారులకు  మధ్య సమన్వయానికి కృషి చేశారు.  దీంతో  నాడు ముఖ్యంగా ఆఫ్రికాను కబళించిన ఎబోలా చాలావరకు తగ్గుముఖం పట్టింది. తనను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించినందుకు రాన్..బైడెన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఇకపోతే , అమెరికా ఎన్నికల్లోట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడం తనకు ఇరకాట పరిస్థితిని సృష్టిస్తోందని ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. దయచేసి మీ ఓటమిని అంగీకరించండి..మీ వైఖరి మీ హుందాతనానికి దోహదపడదు అని  ఆయన వ్యాఖ్యానించారు. తను విజయం సాధించానని రిపబ్లికన్లు కూడా ఒప్పుకుంటున్నారని, కావాలనుకుంటే తను కూడా కోర్టుల్లో దావాలు వేస్తానని, కానీ అందుకు తన మనస్సాక్షి అంగీకరించడం లేదని బైడెన్ పేర్కొన్నారు. మిస్టర్ ప్రెసిడెంట్  ఐ లుక్ ఫర్వర్డ్ టు స్పీకింగ్ విత్ యూ అని జాలిగొలిపే విధంగా ఆయన మాట్లాడారు. నిజం చెప్పాలంటే ట్రంప్ వైఖరితో తను అయోమయ పరిస్థితిలో ఉన్నానని, ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
Tags:    

Similar News