నంద్యాల బరిలో భూమా అన్న కొడుకు?

Update: 2017-03-17 05:08 GMT
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల బరిలోకి దిగేందుకు వారసుడి ఎంపిక మొదలైంది. తెలుగు దేశం పార్టీ నుంచి ఇప్పటివరకు దీనిపై క్లారిటీ రాకపోయినా భూమా కుటుంబంలో దాదాపుగా క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు.. మరో కుమార్తె - కుమారుడు ఇంకా చిన్నవారే కావడంతో ప్రస్తుతానికి అదే కుటుంబానికి చెందిన మరో వారసుడి పేరు తెరపైకి వచ్చింది. నాగిరెడ్డి  సోదరుడు శేఖర్ రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పేరు వినిపిస్తోంది.
    
గతంలో శోభా నాగిరెడ్డి మృతి సమయంలోనే బ్రహ్మానందరెడ్డి ఆసక్తి కనబరిచారు. అయితే నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియను బరిలోకి దింపారు. దీంతో బ్రహ్మానందరెడ్డి కోరిక కోరికగానే మిగిలిపోయింది. బ్రహ్మానందరెడ్డి తండ్రి శేఖరరెడ్డి మరణం తరువాతే నాగిరెడ్డికి ఆయన స్థానంలో టిక్కెట్ వచ్చింది. అప్పటి నుంచి నాగిరెడ్డి ఇంటినుంచే రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. నాగిరెడ్డి అన్నదమ్ములు బతికి ఉన్ననాటి నుంచి వారిది ఉమ్మడి కుటుంబమే. ఇప్పటికీ వారంతా కలిసే ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నాన్న మృతి తో ఖాళీ అయిన సీటును బ్రహ్మానంద రెడ్డి కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
Read more!
    
ప్రస్తుతం బ్రహ్మానందరెడ్డి ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెందిన జగత్ డెయిరీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. వైసీపీ నేత, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి  బ్రహ్మానందరెడ్డి అల్లుడు. దీంతో ఆయన బరిలో దిగితే కాటసాని కూడా మద్దతు ప్రకటిస్తారని  తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News