వాహనాల చలానాలపై హైకోర్టు ఆదేశం.. సీఎం రేవంత్‌కు ఎఫెక్టేనా?
రాంగ్ పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్, నో హెల్మెట్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్.. ఇలా అనేక రీజన్లతో వాహన దారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తుంటారు.;
రాంగ్ పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్, నో హెల్మెట్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్.. ఇలా అనేక రీజన్లతో వాహన దారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయా ఉల్లంఘనలకు సంబంధించి ఫైన్లు వేస్తారు. చలానాలు రాస్తారు. స్పాట్‌లో అయినా.. లేదా తర్వాతైనా ఆన్‌లైన్‌లో చెల్లించేందు కు అవకాశం ఉంటుంది. కానీ, వాహనదారులు ఏళ్ల తరబడి ఆ చలానాలకు సంబంధించిన సొమ్మును చెల్లించడం లేదు. దీంతో పోలీసులు ప్రత్యేక డ్రైవులు చేపట్టి మరీ.. వాటిని వసూలు చేసుకుంటున్నారు.
అయితే.. ఇలా వసూలు చేయడానికి వీల్లేదంటూ.. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చలానాలు రాయడం వరకే పోలీసుల బాధ్యత అని.. వాహనదారులను ఇబ్బందులు పెట్టి సదరు చలానాల సొమ్మును వసూలు చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ఒకవేళ కాలం చెల్లిన చలానాల విషయం లో అయితే.. వాహనదారులకు నోటీసులు ఇచ్చి.. వారు చెల్లించేలా ప్రోత్సహించవచ్చని పేర్కొంది. అంతేకానీ బలవంతం చేయడానికి వీల్లేదని తెలిపింది.
ఇదేసమయంలో .. వాహనాలను ఆపేక్రమంలో తాళాలు తీసుకోవడం, హెల్మెట్లు లాక్కోవడం వంటివి చట్ట రీత్యా నేరమని కోర్టు ఆదేశించింది. వాహన దారులతో మర్యాదగా మెలగాలని.. స్పష్టం చేసింది. వాహన దారుల ట్రాఫిక్ వైలేషన్లకు సంబంధించిన సొమ్మును వారే స్వచ్ఛందంగా చెల్లించే వెసులుబాటు కల్పిం చాలని పేర్కొంది. అనంతరం.. కేసును కొట్టి వేసింది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న చలానాల వ్యవస్థ కేసీఆర్ హయాంలోదే కావడం గమనార్హం.
ఇక, హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన కీలక అంశంపై ప్రభా వం చూపించే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇటీవల వాహనాలపై చలానాలు రాసినవెంటనే ఆ సొమ్ము ఆటోమేటిక్‌గా వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి కట్ అయ్యే వ్యవస్థను తీసుకువస్తామని ఇటీవల ఆయన ప్రకటించారు. కానీ.. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో రేవంత్ రెడ్డి ప్రకటన ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.