వైరల్ ఇష్యూ... కేరళ బస్సుల్లో మారిన మగవారి ప్రయాణం!

అవును... తనను కావాలనే అసభ్యకరంగా తాకాడంటూ కేర శింజిత అనే మహిళ.. దీపక్ అనే వ్యక్తికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ, సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే;

Update: 2026-01-20 12:44 GMT

కేరళ ప్రభుత్వ బస్సులో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత.. 42 ఏళ్ల దీపక్ అనే వ్యక్తి తన ఇంట్లో చనిపోయి కనిపించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కోజికోడ్‌ లోని గోవిందపురంలో నివసిస్తున్న దీపక్.. తన బెడ్‌ రూమ్ లోపల సీలింగ్ ఫ్యాన్‌ కు వేలాడుతూ కనిపించాడని పోలీసులు వెల్లడించారు. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి!

ఇందులో భాగంగా... బస్సులో జనసమూహం కారణంగా ఇది సహజమైన చేతి కదలిక అని చాలా మంది వీక్షకులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యలోనే దీపక్ మరణం ఆగ్రహాన్ని రేకెత్తించిందని చెబుతున్నారు. శింజిత ప్రమాదవశాత్తు టచ్ జరిగినట్లు కనిపించే దాని ఆధారంగా లైంగిక వేధింపులను అతిశయోక్తిగా చేసిందని పలువురు విమర్శించారు! అయితే ఆమె మాత్రం... ఇది కావాలని చేసిన పనే అని తెలిపారు. ఈ సమయంలో కేరళ బస్సుల్లో మగవారి ప్రయాణం మారింది!

అవును... తనను కావాలనే అసభ్యకరంగా తాకాడంటూ కేర శింజిత అనే మహిళ.. దీపక్ అనే వ్యక్తికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ, సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.. లక్షల్లో వీక్షణలు వచ్చాయి! అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా పలువురు అత్యుత్సాహంతో దీపక్ ను విపరీతంగా ట్రోల్ చేశారని అంటున్నారు. దీంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన దీపక్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

ఈ నేపథ్యంలో.. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పలువురు పురుషులు కేరళలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ విచిత్ర రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... మహిళలకు తాకకుండా అట్ట పెట్టెలను ఒంటికి చుట్టుకుని ప్రయాణిస్తున్నారు.. దీపక్‌ కు మద్దతుగా ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వ్యూస్ కోసం చేసిన ఆరోపణలుగా ఆమె వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తున్నారు!

ఈ సందర్భంగా పలువురు మహిళలు సైతం సోషల్ మీడియా వేదికగా దీపక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా... ఈ వీడియోపై ఆమెకు 2 మిలియన్ల వీక్షణలు వచ్చాయని.. ఈ వ్యక్తి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని.. అతను అప్పటికే ఆమె ముందు నిలబడి ఉన్నప్పుడు ఆమె రికార్డ్ చేయడం ప్రారంభించిందని.. అతని శరీరం ఆమెకు చాలా దూరంగా ఉందని.. అప్పుడు ఆమె అతని చేతి పక్కన తన ముందు భాగాన్ని ఉంచి తిరుగుతుందంటూ దీపికా నారాయణ్ అనే జర్నలిస్టు ఎక్స్ వేదికగా స్పందించారు.

ఇప్పటికే ఈ విషయం స్పందించిన దీపక్ బంధువులు, స్నేహితులు... ఆ వీడియో విస్తృతంగా ప్రచారం అయినప్పటి నుండి అతడు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. సోషల్ మీడియాలో పోస్టులపై స్పందిచేటప్పుడు ఒకటికి రెండు సార్లు నిజనిర్ధారణ చేసుకోవాలని కోరుతున్నారు! ఈ క్రమంలో పలువురు పురుషులు కేరళ బస్సుల్లో తెలుపుతున్న నిరసన ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.




Tags:    

Similar News