భువనేశ్వరమ్మ ఇచ్చింది భారతమ్మ ఎప్పుడు ఇస్తుంది...?
ఏపీకి కష్టమొచ్చింది. కొన్ని రోజుల కిందట మూడు జిల్లాల్లో తీవ్ర వర్షాలు.. వరదల దెబ్బతో ప్రజలు కకావిక లం అయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. కోట్ల కొద్దీ రూపాయల ఆస్తులు తుడిచి పెట్టుకు పోయాయి.
దీంతో ఇక్కడి ప్రజలు.. అష్ట కష్టాలు పడ్డారు. ఈ క్రమంలో మనసున్న వారు స్పందించారు. ముఖ్యంగా టాలీవుడ్ స్పందించింది. జూనియర్ ఎన్టీఆర్ నుంచి మహేష్ బాబు వరకు.. చిరంజీవి, అల్లు అర్జున్ వరకు అందరూ.. సాయం చేశారు. రూ.లక్షల్లోనే వారు విరాళంగా ఇచ్చారు.
అదేవిధంగా బాహుబలి ప్రభాస్ కూడా ఆపన్న హస్తం అందించారు. తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళం అందించారు బాధిత ప్రాంతాల్లో సాయం చేయాలని ఆయన కోరారు. ఇలా.. ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ రంగం నుంచి అందరూ ముందుకు వచ్చారు.
అయితే.. నిజానికి టాలీవుడ్ హీరోలు ఇచ్చిన మొత్తం అంతా కూడా.. వారు సంపాయించుకున్న రెమ్మునరేషన్. ఒక రకంగా వారు కష్టపడి తెచ్చుకున్న జీతం. సో.. అందులోంచి కొంత మొత్తం ఇచ్చారు.
ఇంత వరకు బాగానే ఉంది. మరి పారిశ్రామిక వేత్తలుగా ఉన్న వారి విషయానికి వస్తే.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఎండీ నారా భువనేశ్వరి కూడా ముందుకు వచ్చారు. వరద ప్రబావం కొనసాగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా.. బాధితులను ఆదుకున్నారు.
ఆహార పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లు అందించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే క్రమంలో వారికి సాయం చేశారు. మరి.. సీఎం జగన్ కుంటుంబం స్పందించిందా? అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. జగన్ కుటుంబాన్నే తీసుకుంటే..ఆయన సతీమణి భారతమ్మ కూడా పెద్ద పారిశ్రామిక వేత్తే అన్న విషయం తెలిసిందే.
ఆమె చేతిలోనే.. వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. మీడియా సంస్థల నుంచి సిమెంటు కంపెనీల వరకు చాలానే ఉన్నాయి. సీఎం జగన్ సతీమణి.. భారతి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు.. కార్పొరేట్ రెస్పాన్స్ కింద.. సాయం చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పలు వురు వ్యాఖ్యానిస్తున్నారు.కానీ..ఇ ప్పటి వరకు ఆమె రియాక్ట్ కాలేదు.
నిజానికి సొంత మీడియాకు గవర్నమెంట్ నుంచి కోట్ల రూపాయల విలువైన యాడ్లు తీసుకుంటున్నారు. సిమెంటు, పవర్ ఉక్కు కంపెనీల్లో జీతాలు తీసుకుంటూ లాభాలు కూడా సంపాదిస్తున్నారు.
ఆ మాటకు వస్తే ఆదాయం పరంగా చూసినా భారతమ్మే ఎక్కువ విరాళం ఇవ్వాలి. ఎందుకంటే.. అనేక వ్యాపారాలు నిర్వహిస్తుండడంతోపాటు.. తమ సొంత జిల్లాకు కడపకు కష్టం వచ్చిన నేపథ్యంలో ఆమె ముందుగా స్పందించాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు ఆమె స్పందించలేదు.
ఒక్క రూపాయి కూడా విరాళం ప్రకటించలేదు. మరి దీనిని బట్టి.. రాష్ట్రానికి ఆవల ఉన్న సినీ రంగం స్పందించాలి కానీ.. తాము మాత్రం స్పందించకపోయినా.. ఎవరు అడుగుతారనే ధీమానా? లేక.. ఇవ్వకపోయినా.. ఏమవుతుందిలే.. అనుకున్నారా? అనేది ప్రధాన ప్రశ్న.