పీవీ, ఎన్టీఆర్ లకు భారతరత్న ప్రకటించాలి
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కొత్త కొత్త డిమాండ్లు.. కొత్త కొత్త నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పాతబస్తీలోని ఎంఐఎం పార్టీ తాజాగా ట్యాంక్ బండ్ పై ఉన్న పీవీ, ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేయడంతో వారిని ఓన్ చేసుకునే పనిలో బీజేపీ, టీఆర్ఎస్ లు పడ్డాయి. ఇప్పటికే బీజేపీ దీన్ని ఖండించగా.. ఇప్పుడు టీఆర్ఎస్ దాన్ని అందిపుచ్చుకునే పనిలో పడింది.
పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ పేర్లు చెప్పి పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వారు రాష్ట్రానికి చేసిన కృషిని గుర్తించాలని ఆమె కోరారు.
బీజేపీ నాయకులు పీవీ, ఎన్టీఆర్ సమాధుల వద్ద నాటకాలాడటం కాదు తక్షణమే భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారికి భారతరత్నతోనే అత్యున్నత గౌరవం దక్కుతుందని కవిత అన్నారు.
రోహింగ్యాలు, విదేశీయులు ఎక్కడ ఉన్నా అది కేంద్ర వైఫల్యమే అని అన్నారు. రూ.1350 కోట్ల వరదసాయం చేశాకే బీజేపీ నేతలు మాట్లాడాలని కవిత హితవు పలికారు.