• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనాకు యాంటీబాడీస్...

కరోనాకు యాంటీబాడీస్ చికిత్స..భారత్ బయోటెక్ విజయం

By - Tupaki Desk
Update: 2020-05-09 08:30 GMT
ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. వ్యాక్సిన్ రావడానికి మరో ఏడాది పడుతుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే భారత్ లోని హైదరాబాద్ కు చెందిన ‘భారత్ బయోటెక్’ ఫార్మా కంపెనీ అద్భుతం చేసింది. ‘హ్యుమన్-మోనో క్లోనల్ యాంటీబాడీస్’ చికిత్సను అభివృద్ధి చేసింది. భారత్ బయోటెక్ ప్రాజెక్టుకు  సీఎస్ఐఆర్ అనుమతి మంజూరు చేసింది.

భారత్ బయోటెక్ చేపట్టిన ప్రాజెక్టులో పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, ఐఐటీ-ఇండోర్, గురుగ్రామ్ కు చెందిన ప్రిడోమిక్స్ టెక్నాలజీస్ భాగస్వాములుగా పనిచేస్తున్నాయి.

కరోనాకు ఔషధాలు, వ్యాక్సిన్ లేని సమయంలో ప్రత్మామ్మాయ చికిత్స విధానాలు అవసరమని.. అందుకే తాము తయారు చేశామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ చికిత్సతో కరోనా వైరస్ ను నిర్వీర్యం చేయడంతోపాటు వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ తరహా చికిత్స సత్ఫలితాలు ఇస్తుందని సంస్థ పేర్కొంది. వ్యాధి బారిన పడ్డ వారికి ఈ చికిత్స సరైన పరిష్కారం అవుతుందని సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు.

కరోనాను నాశనం చేసే ఈ యాంటీ బాడీల మిశ్రమాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నామని భారత్ బయోటెక్ తెలిపింది. రాబోయే 6నెలల్లో ఈ చికిత్స అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదే కరోనాకు తొలి చికిత్స అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఇదే భారత్ బయోటికె అమెరికాలోని మాడిసన్ లో గల విస్కాన్ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Corona Virus In Andhra Pradesh 
  • Corona Virus 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS