బంగారు రామయ్యగా భద్రాద్రి రాముడు ..కానుకగా 13.50 కిలోల బంగారం !

Update: 2021-06-16 00:30 GMT
భద్రాచలం .. సాక్ష్యాత్ ఆ శ్రీరాముడే కొలువై ఉన్నాడు అని అనిపించే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. భువి పై న ఉండే అత్యంత ప్రసిద్ధి గాంచిన క్షేత్రాలలో ఈ భద్రాచలం కూడా ఒకటి. శ్రీరామనవమి రోజున భద్రాద్రిలో రాముల వారి కళ్యాణం ఎంత ఘనంగా జరుగుతుందో , ఆ కళ్యాణాన్ని చూడటానికి ఎంతమంది వస్తారో చెప్పనక్కర్లేదు. ఇక ఇదిలా ఉంటే భద్రాచలం ఆలయ చరిత్ర లో తొలిసారి ఓ భక్తుడు ఊహించని విదంగా స్వామివారికి , అమ్మవారికి కానుకను బహూకరించాడు. సీతమ్మకు స్వర్ణ కవచంతో కూడిన బంగారు చీర, రామయ్యకు బంగారు పాదాల్ని ఆ భక్తుడు తయారుచేయించి బహూకరించారు.

భద్రాద్రి దేవస్థానంకు చరిత్రలోనే  ఎన్నడూ లేని విధంగా సుమారు 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు. దేవస్థానం చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రాద్రి రామయ్యకు స్వర్ణ భద్రకవచాలు అమరాయి. ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం. ఇకనుంచీ భద్రాద్రిలో ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు లేరు. ఇంత పెద్ద మొత్తంలో దేవునికి స్వర్ణకవచ చాలు ఇవ్వడం ఇదే తోలిసారి. దీనితో ఈ కానుక  చరిత్రలో నిలిచిపోతుందని అక్కడి పూజారులు చెబుతున్నారు.
Tags:    

Similar News