యువత మీద కూడా దేశ ద్రోహమా మోడీజీ?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై ఆంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రైతులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కొందరిని కేంద్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన బెంగళూరుకు చెందిన పర్యావరణ వేత్త దిశా రవి అనే 21 ఏళ్ల అమ్మాయిని అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది., దిశా రవి అరెస్ట్ ను అందరూ ఖండిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ తీరును తప్పుపడుతున్నారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా దిశారవికి మద్దతు లభిస్తోంది. తాజాగా బ్రిటన్ ఎంపీ క్లాడియా వెబ్బే దిశా రవి అరెస్టుపై స్పందించారు. అయితే వెంటనే కేంద్ర ప్రభుత్వం మేలుకొని బ్రిటన్ ఎంపీకి ఓ లేఖను విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా జనవరి 26న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇందులో ఓ రైతు చనిపోవడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి. అయితే అంతకుముందు బెంగుళూరుకు చెందిన దిశా రవి అనే పర్యావరణ కార్యకర్తను 'టూల్ కిట్' ద్వారా అల్లర్లను ప్రేరేపించారని గత సోమవారం ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు తోడుగా ముంబైకి చెందిన నికితా జాకబ్, శంతన్ లను కూడా అరెస్టు చేశారు. ఆమె అల్లర్లను ప్రేరేపించేందుకు స్వీడన్ పర్యావరణ వేత్త గ్రేటా థన్ బర్గ్ సాయం తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు.
అయితే దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నారు. ఈ విషయం తెలిసిన విదేశీయులూ స్పందిస్తున్నారు. తాజాగా బ్రిటన్ ఎంపీ క్లాడియా తన ట్విట్టర్ ఖాతాలో ఓ లేఖను ఉంచారు. అందులో '21 సంవత్సరాల సామాజిక కార్యకర్త దిశా రవి, మరి కొందరు అరెస్టయ్యారు.
దీన్ని చూస్తూ ఊరుకోవద్దు.. రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారికి మద్దతు తెలిపిన వారిని అరెస్టు చేస్తున్నారు.. ఇలాంటి అణచివేత చర్యలు స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడి దారి విధానానికి, అధికారవాదానికి దారి తీస్తాయి..'అని ఆమె విమర్శించారు.
ఈ ట్వీట్ పై భారత్ స్పందించింది. వెంటనే బ్రిటన్ లోని భారత హై కమిషన్ ఓ లేఖను విడుదల చేసింది. 'వ్యసాయ చట్టాలను తాము ఏకపక్షంగా రూపొందించలేదు. వంద కోట్ల రైతుల ప్రయోజనాల కోసమే తయారు చేశారు. ఈ చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో తాము రాజీపడబోము' అని లేఖలో పేర్కొన్నారు.
దిశా రవి సహా ముంబైకి చెందిన యువత టూల్ కిట్ ద్వారా దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొట్టారని పోలీసులు అంటున్నారు.. అయితే టూల్ కిట్ అంటే ఏమిటి..? వీరిని అరెస్టు చేయడానికి కారణాలేంటనే దానిపై అందరూ ఆరాతీస్తున్నారు.
రైతుల ఉద్యమం సాధారణ మీడియాలో కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం పొందింది. దీంతో ఈ ఆందోళనపై కొందరు విదేశీయులు స్పందించారు. స్వీడన్ కు చెందిన పర్యావరణ వేత్త గ్రేటా థన్ భర్గ్, పాప్ సింగర్ నిహా రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. స్వీడన్ కు చెందిన పర్యావరణ వేత్త గ్రేటా ధన్ బర్గ్ టూల్ కిట్ ను రూపొందించారు.
టూల్ కిట్ అంటే సోషల్ మీడియా డాక్యుమెంట్. ఒక సమస్యతో పాటు అందుకు చేయాల్సిన ప్రణాళిక వివరిస్తూ ఉంటుంది. బెంగళూరుకు చెందిన దిశారవి అనే పర్యావరణ వేత్త ఈ టూల్ కిట్ కు ఎడిటర్. ఈమె ఓ డాక్యుమెంట్ ను తయారు చేసి టూల్ కిట్ లో ఉంచి ప్రచారం చేశారు.
ఈమెకు అనుకూలంగా భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ మద్దతు దారులు టూల్ కిట్ తో ప్రచారం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. తాను మాత్రం కేవలం టూల్ కిట్ ను ఎడిట్ చేశానని.. ఇంకే చేయలేదని దిశా రవి చెబుతున్నారు. కోర్టు ఆమెను నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి పోలీస్ కస్టడీకి అప్పగించింది.