ఉద్యోగం పోవడంతో సెక్స్ వర్కర్ గా అవతారం..భార్య విడాకులు

Update: 2021-04-13 16:30 GMT
కరోనా కల్లోలం సృష్టించిన విపత్తు అంతా ఇంతాకాదు.. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. దేశాలన్నీ మైనస్ జీడీపీల్లోకి జారిపోయాయి. వ్యాపార, వాణిజ్యాలు దెబ్బతిన్నాయి. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు.

భారతదేశంలోనూ కరోనా దారుణమైన ఫలితాలను ఇచ్చింది. చాలా మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. బతుకుదెరువు లేక కూలీనాలి చేసుకుంటున్నారు. పాఠాలు చెప్పే టీచర్లు సైతం మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటున్న దైన్యం కనిపించింది.

కరోనా కల్లోలంలో బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల బీపీవో ఉద్యోగి ఉద్యోగం కూడా ఊడిపోయింది. భార్యపిల్లలను పోషించేందుకు ఏం చేయాలో పాలుపోని ఆయన కుటుంబాన్ని పోషించేందుకు కమర్షియల్ సెక్స్ వర్కర్ గా మారాడు. ఈ విషయాన్ని తన 24 ఏళ్ల భార్య దగ్గర దాచిపెట్టాడు.

2017లో పరిచయమై ప్రేమించుకొని 2019లో పెళ్లి చేసుకున్న ఒక జంట బెంగళూరు సుబ్రహ్మణనగర్ లో నివాసం ఉంటోంది. సంసారం సాఫీగా సాగుతున్న వేళ భర్త ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగం కోసం చాలా తిరిగాడు. లాక్ డౌన్ కరోనాతో ఎక్కడి దొరకలేదు.

దీంతో మేల్ సెక్స్ వర్కర్ గా మారాడు. భార్య దగ్గర దాచిపెట్టాడు. ప్రతీరోజు వివిధప్రదేశాలకు భర్త వెళుతుండడంతో భార్యకు అనుమానం వచ్చింది. అడిగితే వింత సమాధానాలు చెప్పాడు. భర్త ప్రవర్తనలో మార్పు చూసి అతడి ల్యాప్ టాప్ తెరిచి చూస్తే మహిళలతో శృంగారంలో ఉన్న ఫొటోలే కనిపించాయి. భర్త మేల్ సెక్స్ వర్కర్ గా మారాడని.. గంటకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు తీసుకుంటున్నాడని తెలుసుకుంది.

దీంతో వెంటనే మహిళల హెల్స్ లైన్ కు ఫోన్ చేసి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. భర్త షాక్ అయ్యి ఆ వృత్తి మానేస్తానని.. వేరే ఉద్యోగం చేసుకుంటానని చెప్పినా భార్య వినలేదు. దీంతో ఇద్దరూ సిటీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
Tags:    

Similar News