పీకేకు జెడ్ ప్లస్ భద్రత ఇచ్చేసిన దీదీ
దేశంలో కొంతమంది అధినేతలు ఉంటారు. ఊహకు అంతుచిక్కని నిర్ణయాలు తీసుకోవటం వారికి అలవాటు. రోటీన్ కు భిన్నంగా ఉండే వారికి వైఖరికి తగ్గట్లే.. తాము అభిమానిస్తే కొండ మీద నుంచి కోతినైనా కిందకు తీసుకొచ్చే సత్తా వారి సొంతం. అదే సమయం లో.. తేడా వస్తే మాత్రం అంతకంతా బదులు తీర్చుకోవటం వారికి అలవాటు. ఆ కోవకే చెందుతారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం సంచలనం గా మారింది. ఇటీవల కాలంలో గాంధీ ఫ్యామిలీ మొదలు చంద్రబాబు వరకూ ప్రముఖులుగా చెప్పే వారందరికి ఇటీవల కాలంలో వారికున్న జెడ్ ప్లస్ భద్రతను తీసేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటివేళ.. ఎలాంటి రాజ్యాంగ పదవుల్ని కానీ.. అధికారిక పదవుల్ని కానీ చేపట్టని ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకూ పీకే చేసేదేమిటి? అంటే.. రాజకీయ పార్టీలకు వ్యూహాలు రచించటం. ఎన్నికల వేళ.. వారి పార్టీ గెలుపు దిశగా ప్లాన్లు సిద్ధం చేయటం. ఇటీవల ఆయన సలహాలు ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ లో అద్భుతమైన మెజార్టీతో విజయఢంకా మోగించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమబెంగాల్ అధికారపక్షమైన దీదీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రంలో ఎక్కడకు పడితే అక్కడకు వెళ్లి.. స్థానిక రాజకీయాల్ని అవగాహన చేసుకొని వ్యూహాల్ని సిద్ధం చేయటం అంటే చిన్న విషయం కాదు. దీనికి తోడు బెంగాల్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేయాలని తపిస్తున్న కమలనాథుల్ని కంట్రోల్ చేయాలంటే పీకే లాంటి వ్యూహకర్తకు ఆ మాత్రం భద్రత అవసరమని భావించారో లేదంటే.. తానేమిటో చెప్పాలనుకున్నారో ఏమో కానీ.. పీకేకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.