• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రూల్స్​ బ్రేక్​ చేసిన...

రూల్స్​ బ్రేక్​ చేసిన ఇంగ్లండ్​ ఆల్ రౌండర్.. బంతికి ఉమ్మిరుద్దాడు..!

By - Tupaki Desk
Update: 2021-03-28 00:30 GMT
బంతిని షైన్​ చేసేందుకు క్రికెట్​ ప్లేయర్లు బంతికి ఉమ్మి రుద్దుతుంటారు. ఈ పద్ధతి ఎప్పటినుంచో ఉంది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కోరలు చాచిన ప్రస్తుత తరుణంలో క్రికెట్​ లో కొత్త రూల్స్​ తీసుకొచ్చారు. అందులో భాగంగా బంతికి ఉమ్మి రుద్దడం నిషేధం.. మొదటి సారి ఎవరైనా ఇలా చేస్తే వార్నింగ్​ ఇచ్చి వదిలేస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే మాత్రం సదరు జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంగ్లండ్​ కు భారత జట్టుకు మధ్య వన్డే సీరిస్​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో  నిన్న రెండో వన్డే జరిగింది.

 ఈ మ్యాచ్​ లో  ఆతిథ్య జట్టు ఇంగ్లండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ సెలైవా ఉపయోగించాడు. బంతికి ఉమ్మి రుద్దాడు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో రీస్‌ టోప్లీ.. నాలుగో ఓవర్‌ రెండో బంతి వేసిన తర్వాత బాల్‌ను తీసుకున్న స్టోక్స్‌ సెలైవా రుద్దాడు. దీంతో అంపైర్​ వీరేందర్​ శర్మ అతడికి వార్నింగ్​ ఇచ్చాడు. ఈ ఘటన మరోసారి రిపీట్​ అయితే జరిమానా  తప్పదని హెచ్చరించాడు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్​లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 336 పరుగులు చేసింది. కేఎల్​ రాహుల్​ సెంచరీ చేశాడు. కానీ ఇంగ్లండ్​ జట్టు చాలా తేలిగ్గా ఈ మ్యాచ్​లో విజయం సాధించింది. భారత్​ భారీ స్కోరు సాధించినప్పటికి బౌలర్లు ఎవ్వరూ పెద్దగా రాణించకపోవడంతే.. ఇంగ్లాండ్​ తేలిగ్గా విజయం సాధించింది. కేవలం 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.బెయిర్​ స్టో 124 పరుగులు తీయగా.. బెన్​ స్టోక్స్​ 99 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్​ చాలా తేలిగ్గా విజయం సాధించింది.
Tags:    
  • Ben Stokes 
  • warned 
  • saliva on ball 
  • India vs Eng 2nd ODI 
  • Telugu News 

Similar News

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

Copyright @2026

Powered by Blink CMS