విదేశీ పక్షుల కు సైనేడ్ సరస్సు గా మారింది
వేలాది కిలో మీటర్ల అవల.. ఎక్కడో ఉండే విదేశాల నుంచి మారిన కాలానికి తగినట్లుగా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టి వేలాది గా వచ్చే విదేశీ పక్షుల కు మరణ శాసనంగా మారింది రాజస్థాన్ రాష్ట్రం లోని సాంబార్ సరస్సు. ఏళ్ల కు ఏళ్లుగా తమ కు అవాసం గా ఉండే ఈ సరస్సు.. సైనేడ్ సరస్సు గా మారి తమ ప్రాణాల్ని తీస్తుందని ఏ మాత్రం ఊహించ లేని పక్షుల కు మరణ శాసనాన్ని రాసేసింది.
మారే రుతువుల కు అనుగుణంగా సదూర తీరాల నుంచి పక్షులు వచ్చి వెళ్లటం తెలిసిందే. ఆకాశంలో అలుపు సొలుపు లేకుండా ప్రయాణించి వచ్చే వేలాది పక్షులు.. ఈ ఏడాది వచ్చాయి. అయితే.. సాంబార్ సరస్సులో ఏమైందో కానీ.. అక్కడి కి వచ్చి సేద తీరే వేళ లో.. వేలాది పక్షులు చచ్చి పోయాయి. దాదాపు 15 రకాల పక్షులు వేలాదిగా సాంబార్ సరస్సుకు రావటం.. శీతాకాలం లో ఇక్కడే ఉండి మళ్లీ వెళ్లిపోవటం కొన్ని వందల ఏళ్లుగా సాగుతోంది.
అయితే.. అలాంటి వలస పక్షులు ఇప్పుడు గడ్డు పరిస్థితి ని ఎదుర్కొంటున్నాయి. వలస పక్షుల మృతి కి కారణం ఏమిటి? అన్నది ఇంకా తేలలేదు. ఈ పరిణామం పర్యా వరణానికి పొంచి ఉన్న ప్రమాద సంకేతం గా పర్యావరణ ప్రేమికులు.. నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం వ్యవధిలో వేలాది పక్షులు మరణించిన తీరుతో సాంబార్ సరస్సు సైనేడ్ సరస్సుగా మారిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాంబార్ సరస్సు లో మరణించిన పక్షుల శాంపిళ్ల ను సేకరించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్.. అసలు కారణం ఏమిటన్న లెక్క తేల్చే ప్రయత్నం చేస్తోంది. వలస పక్షులు మరణించటాని కి కారణం గా ప్రమాద కర వైరస్ అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అరుణ్ ప్రసాద్. వేలాదిగా మరణించిన పక్షుల కళే బరాల్ని తొలగించేందుకు అటవీ శాఖాధికారులు.. గ్రామ పంచాయతీ అధికారులు పని చేస్తున్నారు. వలస పక్షుల ఊసురు తీసిన మహమ్మారి ఏమిటన్నది ఎప్పటికి తేలుతుందో?విదేశీ పక్షులకు సైనేడ్ సరస్సుగా మారింది