చైనాలో మరో అద్భుతం.. భూ సొరంగంలో అందమైన అడవి
ప్రకృతిలో కొన్ని దృశ్యాలు మనసుకు ఎంతో హాయినిస్తాయి. ఆహ్లాదంతో పాటు ప్రకృతి మనకు అప్పుడప్పు కొన్ని అద్భుతాలను కూడా చూపిస్తూ ఉంటుంది. అలాంటి ఓ అద్భుతం చైనాలో కనిపించింది.
చైనా.. పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ది గ్రేట్ వాల్, గ్లాస్ బ్రిడ్జ్ వంటి అద్భుతాలు. ప్రపంచంలోని వింతల్లో ఒకటైన ది గ్రేట్ వాల్‌తో ప్రతిష్ఠ మూటగట్టుకున్న చైనాలో ఇప్పుడు మరో వింత బయటపడింది. సాధారణంగా అడవులు భూమిపై ఉంటాయి. అది కూడా జనారణ్యంలో కాకుండా ఏవో మారుమూల ప్రాంతాల్లో. కానీ చైనాలో మాత్రం భూమిలోపలి సొరంగంలో ఓ అద్భుతమైన అడవిని కొందరు పరిశోధకులు గుర్తించారు.
సాధారణంగా భూమి లోపలి సొరంగాల్లో అంతా చీకటిగా ఉంటుంది. లోపలికి వెళ్లాలంటే భయంభయంగా అనిపిస్తుంది. కానీ చైనాలోని ఓ సొరంగాన్ని చూడటానికి మాత్రం అందరూ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే ఆ సొరంగంలో ఓ దట్టమైన అడవి ఉంది. పచ్చని చెట్లు.. భారీ వృక్షాలు.. అందమైన రంగుల్లో పూలతో.. ఆ సొరంగమంతా పచ్చదనం పులుముకుని అద్భుతంగా కనిపిస్తోంది. ఈ అడవికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ ప్రాంతంలో కొందరు అన్వేషకులు సొరంగంలో దట్టమైన అడవిని కనుగొన్నారు. ఈ భారీ సింక్ హోల్ 306 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు, 192 మీటర్ల లోతు ఉన్నట్లు అన్వేషకులు తెలిపారు. ఈ సింక్‌హోల్ ఘనపరిమాణం 5 మిలియన్ క్యుబిక్ మీటర్లకు మించి ఉంది. ఇప్పటివరకు కనిపెట్టిన అన్ని సింక్‌హోల్‌లో ఇదే పెద్దది.
ఈ సింక్‌హోల్‌లో ఒక దట్టమైన పెద్ద అడవి పెరిగిపోయింది. ఇందులోని చెట్లు 131 అడుగుల ఎత్తు ఉన్నాయని చెప్పారు. ఈ అడవిలో ఉన్న ప్రత్యేకమైన చెట్లు, ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయిన మొక్కలు ఇంకా రకరకాల జీవులు ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొత్తగా కనిపెట్టిన ఈ పెద్ద సింక్‌హోల్‌తో చైనాలో వీటి సంఖ్య 30కి చేరుకుంది.
ఇప్పటి వరకు సైన్స్ గుర్తించని లేదా వర్ణించని జాతులు ఇందులో కనిపించే అవకాశం ఉందని ఈ అడవిని గుర్తించిన అన్వేషకులు చెబుతున్నారు. పరిశోధకులు సింక్‌హోల్ దిగువకు చేరుకోవడానికి చాలా గంటలు కాలినడక ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. మరోవైపు.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతం అందమైన కార్ట్స్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు.
Full View