వేల కోట్ల ‘పెద్ద’ల రుణాలు రద్దు..జాబితా చాలా పెద్దదే!
పంటలు సాగు చేసుకునేందుకు వేల మొత్తంలో రుణాలు తీసుకున్న రైతుల నుంచి ముక్కు పిండి మరీ సదరు రుణాలను వసూలు చేస్తున్న బ్యాంకులు.... గద్దలుగా మారిపోతున్న ‘పెద్ద’ల రుణాలను మాత్రం మాఫీ చేసేస్తున్నాయి. ఇప్పటికే ఈ తరహాలో పెద్ద సంఖ్యలో ఉద్దేశపూర్వకంగానే రుణాలను ఎగవేసిన బడా బాబుల రుణాలను మాఫీ చేసేసిన బ్యాంకులు తాజాగా రూ.68,607 కోట్ల మేర బడా బాబుల రుణాలను సింగిల్ దెబ్బకు రద్దు చేసి పారేశాయి. ఈ వ్యవహారంపై ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఈ రద్దు చేసిన రుణాల్లో బ్యాంకులను నిండా ముంచేసి ఎంచక్కా విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ మాల్యాతో పాటు మోసాకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన మెహుల్ చోక్సీల రుణాలూ ఉండటం గమనార్హం. రద్దైన ఈ రుణాల జాబితాలో మన తెలుగు నేలకు చెందిన బడా బాబులు కూడా చాలా మందే ఉన్నారు. మొత్తంగా మాల్యాతో పాటు చోక్సీని ఓ వైపు దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా చెబుతున్న తరుణం లో.. ఇలా వేల కోట్ల రుణాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం నిజంగానే పెను దుమారాన్నే రేపిందని చెప్పక తప్పదు.
రూ.68 వేల కోట్లకు పైగా రద్దైన ఈ రుణాల జాబితాలో మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ కు చెందిన రూ.5,492 కోట్ల రుణాలు ఉన్నాయి. అదే విధంగా విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు చెందిన 1,943 కోట్ల రుణాలు కూడా రద్దైపోయాయి. ప్రస్తుతం వీరిద్దరూ రుణాలను ఎగవేసి ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా తేలిపోగా.. వారిని విదేశాల నుంచి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరి కంపెనీల స్థాయిలోనే ఆర్ ఈఐ ఆగ్రోకు చెందిన రూ.4,314 కోట్లు - విన్ సమ్ డైమండ్స్ కు చెందిన రూ.4,076 కోట్ల మేర రుణాలు కూడా రద్దై పోయాయి. ఇలా మొత్తంగా ఓ 50 సంస్థలకు చెందిన రూ.68, 607 కోట్ల రుణాలు రద్దైపోయాయి. ఈ జాబితాలో మన తెలుగు నేలకు చెందిన బడా బాబుల కంపెనీలు కూడా ఉన్నాయి. అందులో డక్కెన్ క్రానికల్ కు చెందిన రూ.1,962 కోట్లు - ట్రాన్స్ ట్రాయ్ కు చెందిన రూ.1,790 కోట్లు - ఇందూ ప్రాజెక్ట్స్ కు చెందిన రూ.835 కోట్ల మేర రుణాలు కూడా రద్దైపోయాయి. డక్కెన్ క్రానికల్ సంస్థ వెంకట్రామిరెడ్డికి చెందినది కాగా, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందనది. ఇక ఇందూ ప్రాజెక్ట్స్.. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన సంస్థ.
మొత్తంగా ఈ రద్దైన రుణాల్లో మొత్తానికే మొత్తంగా ఉత్తరాది కంపెనీలే కాకుండా మన దక్షిణాదికి ప్రత్యేకించి తెలుగు నేలకు చెందిన కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. అటు రాజకీయ పలుకుడి కలిగిన నేతలే కాకుండా రాజకీయ వాసనలు లేని ప్రముఖుల కంపెనీల రుణాలు కూడా రద్దు కావడం చూస్తుంటే... బ్యాంకులను తమదైన శైలి కుయుక్తులతో మోసం చేయగలిగిన వారి రుణాలు ఇట్టే రద్దైపోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. పంట రుణం తీసుకున్న రైతో - ఇంటి రుణం తీసుకున్న వేతన జీవో రుణం కట్టకుంటే... ఇళ్లు - ఆస్తులను వేలానికి వేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చే బ్యాంకులు... ఇలా తమను నిండా ముంచేసిన బడా బాబుల రుణాలను మాత్రం ఒక్కదెబ్బతో ఇలా వేలకు వేల కోట్ల రుణాలను రద్దు చేస్తుండటం నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయమే. కనీసం ఈఎంఐలను వాయిదా వేసేందుకు కూడా మధ్య తరగతి ప్రజలకు అవకాశం ఇచ్చేందుకు ససేమిరా అంటున్న బ్యాంకులు... ఇలా బడా బాబులకు చెందిన వేల కోట్ల రుణాలను మాత్రం రద్దు చేస్తుండటం ఏ లెక్కన నీతి అర్ధం కాని పరిస్థితి నెలకొంది.