భారత్ కి బిగ్ షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్‌ ..ఏమైదంటే !

Update: 2020-10-15 10:30 GMT
జీడీపీ పరంగా  ఈ ఏడాదిలో ‌బంగ్లాదేశ్‌ భారత్ ‌ను అధిగమించనుంది. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో తలసరి జీడీపీలో భారీ కోత తప్పదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ) నివేదిక స్పష్టం చేసింది. 2020లో బంగ్లాదేశ్‌లో తలసరి జీడీపీ 1888 డాలర్లతో 4 శాతం వృద్ధి చెందుతుందని, భారత్ ‌లో తలసరి జీడీపీ  గత నాలుగేళ్ల కనిష్టస్ధాయిలో 10.5 శాతం తగ్గి 1877 డాలర్లకు పడిపోతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.

ఈ గణాంకాల ఆధారంగా చూస్తే దక్షిణాసియలో భారత్‌ మూడవ అత్యంత పేద దేశంగా నిలిచే అవకాశం కూడా ఉంది.2021 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి భారత తలసరి స్థూల జాతీయోత్పత్తి 10.3 శాతం తగ్గి 1877 డాలర్లకు చేరుకోనుందని ఐఎంఎఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 1888 డాలర్లకు పెరుగుతుందని ఆ నివేదిక వెల్లడించింది. భారత్‌ తర్వాత పాకిస్తాన్‌, నేపాల్‌ లు తక్కువ తలసరి జీడీపీ ని కలిగిఉండగా..బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంక, మాల్దీవులు భారత్‌ కంటే ముందున్నాయి.

దక్షిణాసియాలో శ్రీలంక తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని డబ్ల్యూఈఓ గణాంకాలు స్పష్టం చేశాయి. కాగా నేపాల్‌, భూటాన్‌ లు ఈ ఏడాది ఆర్థిక వృద్ధిని సాధిస్తాయని, అయితే 2020 ఆపైన పాకిస్తాన్‌ కు సంబంధించిన గణాంకాలు, అంచనాలను ఐఎంఎఫ్‌ వెల్లడించలేదు. వచ్చే ఏడాది భారత్ లో ఆర్థిక రికవరీ చోటుచేసుకుంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అదే జరిగితే 2021లో తలసరి జీడీపీలో బంగ్లాదేశ్‌ ను భారత్‌ అధిగమించే అవకాశం ఉంటుంది.
Tags:    

Similar News