బంగ్లాను ఓడించి.. భారత్‌ను గెలిపించింది పాకిస్థానీయా?
వినటానికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఇదే ముమ్మాటికి నిజం అని బల్లగుద్ది వాదిస్తున్నారు బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు. తమను దెబ్బ కొట్టి భారత్‌ను గెలిపించటంలో ఒక పాకిస్థానీ కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు. ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు ఔట్ కావటానికి ఒక పాకిస్థానీనే కారణమంటూ ఆరోపణ చేస్తున్నారు.
ఇంతకీ అదెలానంటే.. దానికి వారిస్తున్న వివరణ ఏమిటంటే.. గురువారం జరిగిన మ్యాచ్‌లలో అంపైర్లుగా వ్యవహరించిన వారిలో పాక్‌కు చెందిన అలీమ్ దార్ ఒకరు. రోహిత్‌శర్మ ఔట్ అయిన ఒక బంతిని నోబాల్‌గా ప్రకటించటం ద్వారా.. రోహిత్‌శర్మకు లైఫ్ ఇచ్చారని.. ఈ నిర్ణయం తప్పు అని ఆరోపిస్తున్నారు.
ఈ నిర్ణయం తీసుకున్న అంపైర్ పాకిస్థానీ కావటంతో బంగ్లా అభిమానులు ఇలా వాపోతున్నారు. భారత్ స్కోర్ 300 దాటటానికి రోహిత్ ముఖ్యకారణమని.. తమ జట్టు పరాజయం పాలు కావటానికి పాకిస్థాన్ అంపైరే కారణమని బంగ్లాదేశీయులు వాపోతున్నారు. తమ ఆవేదనను చేతల్లో చూపిస్తూ అలీమ్‌దార్ దిష్టిబమ్మను బంగ్లాదేశ్‌లోని ఢాకా వీధుల్లో తగలబెట్టటం వరకూ వెళ్లింది.