బంగ్లాదేశ్ కోచ్ గా.. భారత క్రికెటర్!

Update: 2019-07-16 08:34 GMT
ఇది వరకూ కూడా పలువురు భారత క్రికెటర్లు విదేశాలకు కోచ్ లుగా వ్యవహరించారు. వివిధ దేశాల క్రికెట్ జట్లకు మనోళ్లు కోచ్ లుగా వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అదే జాబితాలో నిలుస్తున్నాడు వసీం జాఫర్.

అత్యంత సీనియర్ ప్లేయర్ గా పేరుంది జాఫర్ కు. పలు అంతర్జాతీయ మ్యాచ్ లు కూడా ఆడాడు. రంజీట్రోఫీలు ఆడటంలో జాఫర్ కు పోటీ వచ్చే క్రికెటరే లేడు. రంజీ క్రికెట్ లో ‘సచిన్ టెండూల్కర్’ గా పేరు పొందిన ఆటగాడు ఇతను.

రంజీల్లో అత్యధిక సెంచరీలు, అత్యంత ఎక్కువ సార్లు రంజీ ట్రోఫీని నెగ్గిన జట్టులో సభ్యుడిగా జాఫర్ కు పేరుంది. ఈ క్రికెటర్ సేవలను వాడుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది.

అందుకే అతడిని బ్యాటింగ్ కోచ్ గా నియమించుకుంది బంగ్లా క్రికెట్ బోర్డు. ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ఫర్వాలేదనిపించుకునే స్థాయిలో రాణించింది. ఇలాంటి నేపథ్యంలో కూడా మరింతగా ఆటకు మెరుగులు దిద్దుకోవాలని ఆ జట్టు భావిస్తోందట. అందుకే జాఫర్ ను కోచ్ గా తీసుకుంటోందని సమాచారం.

మొన్నటి వరకూ ఆ హోదాలో నీల్ మెకంజీ ఉండేవాడు. అతడు వ్యక్తిగత కారణాల చేత కొంత విరామం తీసుకోవడంతో.. జాఫర్ నియామకం జరుగుతోందని సమాచారం.
Tags:    

Similar News