• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ ఐటీ ఇంజనీర్ ఎంత మందికి...

ఆ ఐటీ ఇంజనీర్ ఎంత మందికి అంటించి ఉంటాడు?

By - Tupaki Desk
Update: 2020-03-03 04:50 GMT
కొవిడ్ 19 (కరోనా) పాజిటివ్ కేసు హైదరాబాద్ లో కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటివరకూ దేశంలో వెలుగు చూసిన కేసులకు భిన్నమైనది హైదరాబాద్ ఐటీ ఉద్యోగి ఉదంతం. ఆఫీసు పని మీద హాంకాంగ్ వెళ్లి ఆ తర్వాత దుబాయ్ మీదుగా బెంగళూరు కు వచ్చిన ఆ యువకుడు ప్రైవేటు బస్సు లో హైదరాబాద్ కు వచ్చాడు. ఈ సందర్భంగా అతగాడికి కాస్త దగ్గరగా ఉన్నోళ్లు 80 మందికి పైనే అని లెక్కలేశారు.ఇప్పుడా 80 మందిని గుర్తించి.. వారిలో కొవిడ్ వైరస్ ఎంతమేర ఉందన్న పరీక్షల్ని నిర్వహించాల్సి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఐటీ ఉద్యోగికి కాస్త దగ్గరగా ఉన్న 80 మంది.. ఎంత మందికి దగ్గరగా ఉన్నారు? వారెవరు? ఎక్కడెక్కడ ఉన్నారు? అన్నది అతి పెద్ద ప్రశ్న.

ఏసీ బస్సులో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు.. మిత్రులు.. బంధువులతో సన్నిహితంగా ఉండటం.. వారెంతమంది ఉంటారన్నది మరో ప్రశ్న. ఇప్పటికి 11 మందిని గుర్తించిన అధికారులు వారి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొవిడ్ వైరస్ పాజిటివ్ అని తేలటానికి ముందు సదరు ఐటీ ఉద్యోగి సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లటం.. అతనికి చికిత్స చేయటంతో పాటు.. వైద్య సాయం చేసిన సిబ్బందిలో ఎంతమందికి కొవిడ్ వైరస్ బదిలీ అయి ఉంటుందన్నది ఒక ప్రశ్న అయితే.. వారి ద్వారా వేరే వారికి వ్యాపించే అవకాశం ఎంతమేర ఉందన్న విషయాన్ని ఆలోచిస్తుంటేనే గుండెలు దడదడమని కొట్టుకునే పరిస్థితి.

కొవిడ్ వైరస్ సోకిన వ్యక్తి మరో వ్యక్తికి దగ్గరగా ఉండటం తో ( సెకండ్ పర్సన్ ) వైరస్ ప్రవేశించే అవకాశం ఉంది. ఆ సెకండ్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్ లోకి వైరస్ వెళ్లటం మొదలైతే మాత్రం నిలువరించటం అంత తేలికైన విషయం కాదన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి.. వైద్య ఆరోగ్య శాఖకు ఇప్పడిదే అంశం పెద్ద టెన్షన్ గా మారింది. మొత్తంగా కొవిడ్ పాజిటివ్ ఉన్న ఐటీ ఉద్యోగి ఎంతమందికి తన వైరస్ ను అంటించి ఉంటాడన్న విషయం పెద్ద ప్రశ్నగా మారింది. ఆ విషయం తేలే లోపు కొవిడ్ వైరస్ మరెంతమందికి వ్యాపిస్తుందన్నది బిలియన్ డాలర్ల క్వశ్చన్.
Tags:    
  • Bangalorean in Hyderabad found afflicted with coronavirus 
  • Corona in China 
  • Corona Virus in China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS