'బండ్ల గణేష్ అనే నేను..' ఇప్పుడిదే వైరల్

Update: 2018-10-04 07:07 GMT
ఇటీవలే ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రెచ్చిపోయి రొచ్చు రొచ్చు చేసిన హాస్యనటుడు, నిర్మాత, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇటీవలే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో బండ్లగణేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని  షాద్ నగర్/జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద జర్నలిస్ట్ మూర్తి.. బండ్ల గణేష్ ను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశాడు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘రాబోయే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 104 సీట్లను గెలుచుకోబోతోందని.. తాను ఎమ్మెల్యేగా.. అవసరమైతే మంత్రిగా కూడా కావచ్చని’ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. మంత్రిగా ప్రమాణం చేస్తున్న వ్యాఖ్యలను కూడా గట్టిగా వినిపించారు. ‘బండ్ల గణేష్.. అనే నేను..’ అంటూ మొదలుపెట్టారు.  ఇటీవల విడుదలైన  ‘భారత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబు చేసిన ప్రమాణం స్టైల్లో బండ్ల చేసిన ప్రమాణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తాను ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అవుతానని.. అందులో డౌట్ లేదంటూ బండ్ల ఆ వీడియోలో వివరించారు.

ఇప్పుడు ‘బండ్ల గణేష్  అనే నేను’ వీడియో సోషల్ మీడియాలో  హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో కాదంటూ నెటిజన్లు బండ్ల గణేష్ వీడియోపై సెటైర్లు వేస్తున్నారు. బండ్లను ఏకిపారేస్తూ ట్రోలింగ్ లు కూడా మొదలుపెట్టారు. టీవీ స్టూడియోలో ఇలాంటి ప్రమాణాలు ఏంటంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
Tags:    

Similar News