అక్కడి మహిళావర్సిటీ లో అమ్మాయిల ఫోన్ వాడకం పై బ్యాన్
కొత్త తరహా ఆంక్షలకు తెర తీసింది పాకిస్థాన్. ఆ దేశంలోని ఒక మహిళా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించే విద్యార్థినులు స్మార్ట్ ఫోన్లను వినియోగించటాన్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెహ్రిక్ తాలిబన్ మిలిటెంట్లు క్రియాశీలంగా ఉండే ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలోని మహిళా విశ్వవిద్యాలయంలో నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లుగా ఒక మీడియా సంస్థ పేర్కొంది.
తాజాగా విధించిన బ్యాన్ ప్రకారం చూసినప్పుడు వర్సిటీ లోపలకు స్మార్ట్ ఫోన్లు.. టచ్ స్క్రీన్లు.. మొబైల్ ఫోన్లతో పాటు ట్యాబ్ లను సైతం అనుమతించమని స్పష్టం చేశారు. అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బుధవారం (ఏప్రిల్ 20న) నుంచి ఈ బ్యాన్ అమల్లోకి రానుంది. అయినప్పటికీ ఈ ఆంక్షల్ని అధిగమిస్తూ.. ఆదేశాల్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు రూ.5వేలు జరిమానాను విధించనున్నారు.
పాక్ లోని మిగిలిన ప్రాంతాల తీరు ఒకలా.. ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పాలి. ఇక్కడ మహిళలపై తరచూ ఆంక్షల్ని విధిస్తూ ఉంటారు.
అమ్మాయిలంతా సల్వార్ కమీజ్ ధరించాలని.. దుపట్టా తప్పనిసరి చేయటం.. భారీగా నగలు పెట్టుకోవటం లాంటివి లేకుండా చేయాలని.. ఖరీదైన హ్యాండ్ బ్యాగుల్ని అనుమతించకుండా ఉండటం లాంటివెన్నో అమలు చేస్తుంటారు. చివరకు హెయిర్ స్టైల్ మీద కూడా ఆంక్షలు ఉండటం గమనార్హం.
గత ఏడాది మార్చిలో పెషావర్ వర్సిటీలో కొత్త డ్రెస్ కోడ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. దీని ప్రకారం తమకు నచ్చిన కమీజ్ తో పాటు తెల్లని సల్వార్ ధరించాలన్న షరతు పెట్టింది. అదే సమయంలో అబ్బాయిలు సైతం మంచిగా కనిపించేలా దుస్తుల్ని ధరించాలని పేర్కొంది.
హజారా వర్సిటీ అయితే విద్యార్థినులు సల్వార్ కమీజ్ ను ధరించాలని.. దుపట్టా వేసుకోవటం తప్పనిసరి అంటూ పేర్కొంది. మొత్తంగా చూసినప్పుడు విద్యాలయాలు విద్యార్థినుల పట్ల ఆంక్షల నిలయాలుగా మారాయని చెప్పక తప్పదు.