• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నా తండ్రి 6కోట్ల ఆప్...

నా తండ్రి 6కోట్ల ఆప్ టికెట్ కొన్నాడు.

By - Tupaki Desk
Update: 2019-05-12 07:16 GMT
ఆమ్ ఆద్మీ పార్టీలో మరో కలకలం రేగింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున ఢిల్లీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అభ్యర్థి బల్బీర్ సింగ్ జాకీర్ రూ. 6 కోట్ల రూపాయలు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు ఇచ్చాడని.. స్వయంగా బల్బీర్ సింగ్ జాకీర్ కొడుకు సంచలన ఆరోపణలు చేశారు. టికెట్ కోసం 6 కోట్లు చెల్లించి కొనుక్కున్నాడని .. కోట్లకు నోటు స్కామ్ ఇది అని ఆరోపించాడు.

తాజాగా బల్బీర్ సింగ్ కొడుకు ఉదయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘తన తండ్రి బల్బీర్ సింగ్.. ఆమ్ ఆద్మీ తరుఫున ఎన్నికల్లో పోటీచేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ కు స్వయంగా 6 కోట్లు ఇచ్చాడు. తాను ఇందుకు సాక్షి. తన సమక్షంలోనే ఈ డబ్బులు ఇచ్చాడు’ అని దుమారం రేపారు.

తన తండ్రి జనవరిలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడని.. ఆరు నెలల కూడా కాకముందే టికెట్ పొందడం వెనుక డబ్బులే పనిచేశాయని ఉదయ్ సంచలనం రేపారు. అన్నా హజారే ఉద్యమంలో కూడా తన తండ్రి పాలుపంచుకోలేదని.. డబ్బులు ఉన్నవాళ్లకే ఆమ్ ఆద్మీలో టికెట్లు ఇచ్చారని విమర్శించారు. వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న తన తండ్రి ఆప్ టికెట్ కోసం రూ.6కోట్లను అరవింద్ కేజ్రీవాల్, గోపాల్ రాయ్ లకు ఇవ్వడం తన సమక్షంలోనే జరిగిందని బాంబు పేల్చాడు.

అయితే తన కొడుకు ఉదయ్ సింగ్ చేసిన ఆరోపణలను బల్బీర్ సింగ్ ఖండించాడు. ఉదయ్ తనతోపాటు ఉండడం లేదని.. దూరంగా ఉంటున్నాడని.. అతడికి తనకు సంబంధం లేదని.. తాను రాజకీయాల గురించి ఎప్పుడూ కొడుకుతో చర్చించలేదని.. ఇన్వాల్వ్ చేయలేదని.. ఉదయ్ ఆరోపణలు వట్టి అబద్ధమని ఖండించారు.

బల్బీర్ తన భార్యతో 2009లోనే విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన భార్య, కొడుకు ఉదయ్ లు వేరుగా జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో బల్బీర్ తన కొడుకుతో మాట్లాడలేదు.. కనీసం కలువలేదని సమాచారం.

అయితే ఈ ఆరోపనలపై బీజేపీ నేత ప్రవీణ్ ఖండేవాల్ ఈసీకి ఫిర్యాదు చేశాడు. ఆప్ టికెట్లను అమ్ముకుంటుందని ఫిర్యాదులో పేర్కొంది.
Tags:    
  • Balbir Singh Jakhar 
  • AAP ticket 
  • Son 

Similar News

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

Copyright @2026

Powered by Blink CMS