టీడీపీ అధ్యక్షపదవికి 100శాతం అర్హుడిని : బాలక్రిష్ణ

Update: 2021-06-11 08:30 GMT
తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్ష పదవికి 100శాతం తాను అర్హుడినని అగ్రహీరో, టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబుకు స్వయాన బావమరిది అయిన నందమూరి బాలక్రిష్ణ స్పష్టం చేశారు. తాను టీడీపీ అధ్యక్ష పదవి కావాలని ఎప్పుడూ చంద్రబాబును అడగలేదని బాలయ్య వివరణ ఇచ్చారు. నేను అలా అడగలేదని.. అస్సలు అడగను అని స్పష్టం చేశారు. ఇంకా మనకు టైం ఉందని చెప్పుకొచ్చారు.

మనం ఎదురుచూద్దామని.. మన అధృష్టం ఎటు తీసుకెళుతుందో తెలియదని.. అది రకరకాలుగా తీసుకెళుతుందని..మనం తీసుకెళితే అది దక్కేది కాదని బాలక్రిష్ణ అన్నారు. ఎప్పుడో ఒకసారి విస్ఫోటనం అవుతుందని.. అది రగులుతున్న సముద్రంలోని అగ్నిపర్వతంలా ఎగిసిపడుతుందని ఓ రకంగా బాలయ్య హెచ్చరికలే చేశారు.టీడీపీ అధ్యక్ష పదవికి తాను వెయిట్ చేస్తానంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు.

పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టే విషయంలో చంద్రబాబుకు ఆప్షన్ ఎవరంటూ ప్రశ్నకు బాలయ్య సమాధానం ఇచ్చారు. ఆయన కుమారుడు లోకేష్ బెటర్ నా? లేక బాలయ్య బెటరాఅని ప్రశ్నించారు.

బాలయ్య సమాధానం ఇస్తూ.. ‘తగిన సమయం కోసం తాను ఎదురుచూస్తున్నానని.. ‘లోకేష్ బాగా చదువుకున్న వ్యక్తి అని.. అల్లాటప్ప మనిషి కాదని.. ఎక్కడ ఏం జరుగుతుంది? ఏపీలో ఐటీ డెవలప్ మెంట్ అయ్యిందంటే లోకేష్ కారణమని’ బాలయ్య అభినందించారు. ఇతర దేశాల్లో ఐటీ మిటింగులు, సదస్సుల్లో ఎంతో చాకచక్యంగా మాట్లాడి ఏపీకి నిధులు తెప్పించారని బాలయ్య చెప్పుకొచ్చాడు.మల్లీనేషనల్ కంపెనీ లు తీసుకొచ్చాడని.. అంతకుముందున్న మంత్రి కంటే కూడా బాగా పనిచేశాడని..లోకేష్ అనుభవం .. కమాండ్.. నాన్న లాగా పరిణతి చెందిన వ్యక్తి, కష్టపడే వ్యక్తి అని లోకేష్ వల్లేనని కాబట్టి అల్లుడు తనకంటే బెస్ట్ అని పరోక్షంగా బాలయ్య సమాధానం ఇచ్చాడు.Full View
Tags:    

Similar News