ఇంటి నుంచే జగన్ కు బాలయ్య షాక్

Update: 2016-02-01 16:15 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కు తాజాగా షాక్ తగిలింది. అయితే.. ఈ షాక్ ఏపీ ముఖ్యమంత్రి వియ్యంకుడు కమ్ బావమరిది.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇచ్చారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని కోడూరు 1.. 2 మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సూర్యనారాయణ.. చెన్నక్రిష్ణలు బాలయ్య సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో జగన్ పార్టీ నేతల్ని తమ పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికి పార్టీ కండవాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. చిలమత్తూరు స్థానిక రాజకీయాలు వేడి పుట్టిస్తున్న వేళ.. జగన్ పార్టీకి చెందిన బలమైన నేతలు హైదరాబాద్ వెళ్లి మరీ బాలయ్య ఇంట్లో పార్టీ మారిపోవటం ఏపీ విపక్ష పార్టీకి ఒకలాంటి షాకింగ్ గా భావిస్తున్నారు.​
Tags:    

Similar News