• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'ప‌రిటాల' నిశ్చితార్థ...

'ప‌రిటాల' నిశ్చితార్థ వేడుక‌లో బాల‌య్య సంద‌డి!

By - Tupaki Desk
Update: 2017-08-10 09:30 GMT
దివంగత పరిటాల రవి - మంత్రి పరిటాల సునీతల కుమారుడు శ్రీరామ్ నిశ్చితార్థ వేడుక‌కు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ  హాజ‌రై సంద‌డి చేశారు. కాబోయే దంపతులు శ్రీరామ్ - జ్ఞానవిలను ఆశీర్వదించారు. బాలకృష్ణ ఈ వేడుకలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ప‌రిటాల శ్రీ‌రామ్, ఆలం జ్ఞానవిల నిశ్చితార్థం ఈ రోజు హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పరిటాల కుటుంబసభ్యులు - బంధువులు - అభిమానుల మధ్య ఈ వేడుక జ‌రిగింది. ఈ నిశ్చితార్థ కార్య‌క్ర‌మానికి చాలామంది సినీ - రాజకీయరంగ ప్రముఖులు తరలి వచ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ఏపీ శాస‌న‌స‌భ స్పీకర్ కోడెల శివప్రసాదరావు - మంత్రులు దేవినేని ఉమ‌ - అయ్యన్నపాత్రుడు - కామినేని శ్రీనివాస్ - కాల్వ శ్రీనివాసులు - మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి - ఎమ్మెల్యే వల్లభనేని వంశీ - ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ - అనంతపురం జెడ్పీ ఛైర్మన్ చమన్ - తదితరులు హాజరయి శ్రీ‌రామ్‌ - జ్ఞానవిల‌ను ఆశీర్వ‌దించారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ఏవీఆర్ కన్‌ స్ట్రక్చన్స్ అధినేత ఆలం వెంకటరమణ - సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానవితో పరిటాల శ్రీరామ్ వివాహం అక్టోబర్ 1న జరగనుంది. అనంతపురం జిల్లా నార్పలకు చెందిన ఆలం వెంకటరమణ కుటుంబం చాలా కాలం నుంచే అనంతపురంలో ఉంటున్నారు. అక్టోబర్ 1న జ‌ర‌గ‌నున్న ఈ వివాహ వేడుకకు సంబంధించిన  సంద‌డి ఇప్ప‌ట్నుంచే ఇరు కుటుంబాల్లో మొద‌లైంది. పరిటాల శ్రీరామ్‌ కు అనంతరపురం జిల్లా ప్రజల్లో యువనేతగా మంచి మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నాయి.
Tags:    
  • Balakrishna 
  • Paritala Sriram Engagement 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS