బాహుబలి విమానం .. కాసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ !

Update: 2020-10-01 12:10 GMT
దేశంలోని ముగ్గురు వీవీఐపీలు... రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచూ ప్రయాణించే విమానాల జాబితాలో అత్యాధునిక విమానాలు చేరనున్నాయి. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించేందుకు తయారైన ఎయిరిండియా వన్ విమానం అమెరికా నుంచి ఇండియాకు ఈరోజు వస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో బోయింగ్ సంస్థ తన బీ777 ఎయిర్ క్రాఫ్ట్ ను ఎయిరిండియా వన్ గా రూపుదిద్దింది.

ఈ విమానాన్ని ఎయిర్ ఇండియాకు బోయింగ్ గత ఆగస్టులోనే అందించాల్సి ఉండగా... కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యమైంది. కాసేపట్లో ఈ విమానం ఢిల్లీలో ల్యాండ్ కానుంది. మరో విమానం కొన్ని రోజుల తర్వాత అందనుంది. మరోవైపు వీవీఐపీల ప్రయాణ సమయాల్లో ఈ రెండు విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు నడపనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడుపుతున్నారు. అంతేకాదు ఇతర సమయాల్లో వాటిని కమర్షియల్ ఆపరేషన్లకు కూడా వినియోగిస్తున్నారు. కానీ, ఎయిరిండియా విమానాలను మాత్రం కేవలం వీవీఐపీల కోసం మాత్రమే వినియోగించనున్నారు.

అమెరికా అధ్య‌క్షులు వాడే ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానం.. దాదాపు 1013 కిలోమీట‌ర్ల వేగంతో సుమారు 35వేల ఫీట్ల ఎత్తులో ప్ర‌యాణించ‌ గ‌ల‌దు. అయితే ఇదే త‌ర‌హాలో ఎయిర్ ఇండియా వ‌న్ విమానం కూడా గంట‌కు 900 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌నున్న‌ది. వైమానిక ద‌ళానికి చెందిన పైల‌ట్లు.. ఎయిర్ ఇండియా వ‌న్ విమానాన్ని ఆప‌రేట్ చేయ‌నున్నారు. ఎయిర్ ఇండియా వ‌న్‌లో అడ్వాన్స్‌, సెక్యూర్డ్ క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్ ఉన్న‌ది. ఆడియో, వీడియో క‌మ్యూనికేష‌న్‌.. మార్గ‌మ‌ధ్య ప్ర‌యాణంలో కూడా ప‌నిచేస్తాయి. హ్యాకింగ్ కానీ, టేపింగ్‌కు కానీ అవ‌కాశం లేకుండా క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌నున్న‌ది.
Tags:    

Similar News