ఎక్కువ మంది సంతానం ఉంటే ఓటుహక్కు కట్

Update: 2019-01-24 07:02 GMT
నల్లధనాన్ని అరికట్టాలని చెప్పే యోగా గురు బాబా రాందేవ్ దృష్టి ఇప్పుడు దేశంలోని జనాభాను నియంతణపై పడింది. ప్రస్తుతం జనాభా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా బాబా రాందేవ్ చండీగఢ్ లో మీడియాతో జనాభా నియంత్రణపై పలు సంచలన సూచనలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.  

ఓవైపు దేశంలోని ఆర్ ఎస్ ఎస్ లాంటి సంస్థలు దేశంలో హిందువులు జనాభా తగ్గిపోతుందని, హిందువులు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని ప్రోత్సాహిస్తుంటే దీనికి విరుద్ధంగా రాందేవ్ బాబా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే వారి ఓటు హక్కును తొలగించాలని చెబుతున్నారు. అంతేనా ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు వంటిని తొలగిస్తే జనాభా నియంత్రణ సాధ్యపడుతుందని అంటున్నారు. ఈ విషయంలో హిందూ, ముస్లింలనే బేధాలు లేకుండా ఎవరైనా సరే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా రాందేవ్ బాబా వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆయనకు మద్దతు ప్రకటిస్తూ మోజార్టీ ప్రజలు మాత్రం ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు చైనా దేశం జనాభా నియంత్రణ కఠినం చేయడంతో ఆ దేశంలో ప్రస్తుతం యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దేశం అభివృద్ధి చెందాలంటే జనాభా అవసరమని గ్రహించిన చైనా తాజాగా ఒకరు ముద్దు.. అసలే వద్దు.. అనే నినాదాన్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం చైనా కూడా జనాభా నియంత్రణపై వెనక్కి తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది అమలు కావడం అసాధ్యమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాందేవ్ బాబా రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని అభివృద్ధి చేస్తాడనుకుంటే.. దేశంలోని ప్రతిఒక్కరికి కుటుంబ నియంత్రణ చేసేలా ఉన్నాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా రాందేవ్ బాబా జనాభా నియంత్రణపై దృష్టిసారించడం మాని యోగాపై ధ్యాస ఉంచాలంటున్నారు. మరీ దీనిపై రాందేవ్ బాబా ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.
Tags:    

Similar News