ఆ ఊరి నిండా బాబాలే.. వారికి తగిలారో.. అన్నీ తీర్చేస్తారు!
ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా నాయనా..? వ్యాపారంలో నష్టపోయావా బిడ్డా..? ఇంకా పెళ్లికావట్లేదా చెల్లీ..? ఇంట్లో అన్నీ గొడవలేనా తల్లీ..? అంటూ లోకల్ టీవీ ఛానళ్లలో యాడ్స్ మోత మోగుతుంటాయి. వాల్ రైటింగ్స్ తో, కరెంటు స్తంభాలకు ఫ్లెక్సీలు వేలాడుతుంటాయి. కొంతకాలంగా టెక్నాలజీని అప్డేట్ చేసుకున్న బాబాలు.. ఫోన్ లో బేరం చెప్పేసి.. ఆన్లైన్లో మంత్రాలు చదివేస్తున్నారు. ఫైనల్ గా శఠగోపం పెట్టేసి కంప్యూటర్ షట్ డౌన్ చేస్తున్నారు. ఇలాంటి వారు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారని అనుకుంటున్నారేమో..? ఏకంగా ఒక ఊరే ఉంది! ఒక్కణ్ని వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ఊరే కనిపించడంతో విస్తుపోవడం వారి వంతైంది!
టీవీలో ఓ ప్రకటన చూసి మోసపోయిన ఒక హైదరాబాద్ యువతి ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయట పడింది. పోలీసుల లోతుగా విచారించడంతో ఈ బురిడీ బాబా తీగ ఢిల్లీ డొంకను కదిలించింది! ఈ విషయం తెలుసుకొని ఖాకీలు ఆశ్చర్యపోయారు. ఢిల్లీలోని శాద్రా ప్రాంతంలో ఒక ఊరు మొత్తం ఇలాంటి భాబాలతోనే నిండి పోయిందట.
హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువతి.. టీవీలో వచ్చిన ప్రకటన చూసి అందులోని నెంబర్ కి ఫోన్ చేసింది. అవతలి వారు హలో అనగానే.. గుక్క తిప్పుకోకుండా తన ఇంట్లోని సమస్యలన్నీ వివరించిందా అమయాకురాలు. వెంటనే స్పందించిన బాబా.. 'ఓస్.. అదెంత పని. అభయమిదే బాలికా.. ఈ బాబా ఉండగా నీకు భయమేల? ఇలా నేను ఎంత మందికి చేసుంటాను?' అని ధైర్యం చెప్పాడు.
అయితే.. ఈ సమస్య పరిష్కారానికి ఒక పూజ చేయాల్సి ఉందని ప్రకటించాడు. అప్పుడు ఆ యువతి..'దానికేం భాగ్యం స్వామీ..? అలాగే చేసేయండి.' అన్నది. అప్పుడు బాబావారు 'తప్పకుండా చేస్తాను తల్లీ.. కాకపోతే పూజా సామాగ్రి కావాలి కదా.. కొంచెం ఖర్చవ్వుద్ది' అన్నాడు. 'అవునా.. ఎంత స్వామీ' అని అడగ్గా.. 'ఎంత తల్లీ.. ఓ 5 వేల ఆరు వందల రూపాయలు చాలు' అన్నాడు. దీంతో.. స్వామీకి ఏదో ఒక 'పే'తో అమౌంట్ పంపిచేసిందా యువతి.
డబ్బులు పంపించేసిన తర్వాత ఫోన్ చేస్తే.. సంతోషం తల్లీ అందాయి అని చెప్పాడా బాబాజీ. పూజ గురించి అడగ్గా మంచి ముహూర్తం చూసి కానిచ్చేద్దామని సెలవిచ్చాడు. ఆ తర్వాత మరోసారి యువతి ఫోన్ చేయగా.. 'అమ్మా.. అదీ.. చిన్నపాటి పూజలకు నీ కష్టాలు తొలిగేలా లేవు' అన్నాడు. అయితే.. పెద్దదే చేయండి స్వామీ అన్నదా యువతి. 'పెద్దగా చేయాలంటే.. పెద్ద మొత్తం కావాలి తల్లీ' అన్నాడు సాములోరు. 'అవునా..? ఈ సారి ఎంత స్వామీ' అని అడిగింది అమ్మాయి. దానికి 'ఎంతో కాదమ్మా.. ఒక 30 వేలు చాలు' అన్నాడు. దీంతో సరిపోతాయా స్వామీ అని అడిగితే.. 'సరిపెడతాను' తల్లీ అన్నాడు. ఆ యువతి మరోసారి రూ.30 వేలు పంపించేసింది. ఆ తర్వాత పూజ సంగతి ఎంత వరకు వచ్చింది స్వామీ అని అడిగితే.. 'పూజ మళ్లీ మొదట్నుంచి చేయాలి తల్లీ' అన్నాడట.
అప్పటికి గానీ అర్థం కాలేదు ఆ యువతికి తాను మోసపోయానని! దీంతో.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. టీవీ ప్రకటననుంచీ, గూగుల్ నుండి సదరు బాబా ఫొటోలు, వివరాలు తీసుకొని ఢిల్లీ ఖాకీలకు కబురు పెట్టారు మన పోలీసులు. ఆ కబురు అందుకున్న ఢిల్లీ ఖాకీలు అక్కడ వాలిపోగా.. ఢిల్లీలోని శాద్ర ప్రాంతంలో ఈ ఫేక్ బాబాలతో ఒక ఊరే నిండిపోయి కనిపించింది. ఇది చూసిన పోలీసులు నోరెళ్లబెట్టారట.
హైదరాబాద్ యువతి కాంటాక్ట్ అయిన బాబా పేరుతో అనేక మంది కనిపించారట. ఢిల్లీ నుంచి హైదరాబాద్ లో ఉన్న వారిని మోసగించి డబ్బులు గుంజారంటే.. దేశవ్యాప్తంగా ఎంత మందిని ఇలా మోసం చేసి ఉంటారు? అందుకే.. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దు అంటున్నారు పోలీసులు. మనోళ్లు ఈ మాటలు వింటారంటారా??