2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆయన టీడీపీ నేత.. టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అనుంగ శిష్యుడు. విశాఖ జిల్లాలో బలమైన సామాజికవర్గం అండ గల నేత. కానీ అనూహ్యంగా ఎన్నికలకు కొద్దిరోజుల ముందే గంటాను వీడి.. టీడీపీని కాలదన్ని జగన్ కు జైకొట్టారు. వైసీపీ లో చేరారు. రాజకీయాలు నేర్పిన గురువు గంటానే తిట్టిపోసి ఎదురించారు.
అయితే కేవలం నెలరోజుల ముందు వైసీపీ లో చేరినా ఇప్పుడు జగన్ సర్కారు లో కింగ్ మేకర్ అయ్యాడు. విశాఖ జిల్లా నుంచి ఏకంగా మంత్రి పదవి కొట్టేశారు. ఆయనే అవంతి శ్రీనివాసరావు.. ఏపీ మంత్రి వర్యులు.
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యవహారం అంతు చిక్కని విధంగా ఉందని వైసీపీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనలో భయంతో కూడిన భక్తి ఎక్కువైందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నుంచి అనూహ్యంగా జంప్ అయిన ఈయనకు మంత్రి పదవి భయం పట్టుకుందట.. అందుకే జగన్నామస్మరణం చేస్తున్నారట..జగన్ ఎక్కడికి వెళితే అక్కడికి వాలిపోతున్నారట..
తాజాగా జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల లో పర్యటించారు. మూడు రోజులుగా జగన్ వెంట మంత్రి అవంతి శ్రీనివాస్ కడప జిల్లా లో పర్యటిస్తున్నారు. అవంతి కడప జిల్లా ఇన్ చార్జి మంత్రి కూడా కాదు.. అయినా జగన్ ను విడవకుండా నీడలా తిరుగుతున్నాడు. పులివెందులలో కూడా జగన్ వెన్నంటే ఉన్నారు.
అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి భయం పట్టుకుందని గుస గుసలు వినిపిస్తున్నాయి... వచ్చే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేయడం ఖాయమని జగన్ మంత్రివర్గ విస్తరణ అప్పుడే ప్రకటించారు. అందులో అవంతికి స్థాన మార్పు ఖాయమని అన్నారట.. అందుకే ఇప్పటి నుంచే జగన్ ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట.. ఎప్పుడో పోయే పదవి కోసం ఇప్పటి నుంచే కాక పడుతున్న అవంతి తిప్పలు చూసి వైసీపీలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారట.. అదీ సంగతి..!