పవార్ ఎలా చనిపోయారంటే.. కేంద్ర మంత్రి రామ్మోహన్ చెప్పింది ఇదే!
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్.. బుధవారం ఉదయం ఆ రాష్ట్రంలోని బారామతి నియోజకవర్గానికి వెళ్తుండగా.. ప్రమాదవ శాత్తు.. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కుప్పకూలి చెలరేగిన మంటల్లో చనిపోయారు.;
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్.. బుధవారం ఉదయం ఆ రాష్ట్రంలోని బారామతి నియోజకవర్గానికి వెళ్తుండగా.. ప్రమాదవ శాత్తు.. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కుప్పకూలి చెలరేగిన మంటల్లో చనిపోయారు. అయితే.. అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది? దీనికి కారణాలు ఏంటి? అనే విషయాలపై అధికారికంగా భారత పౌరవిమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఆ సమయంలో విమానం నుంచి రావాల్సిన మేడే కాల్స్ వంటివి వచ్చాయా? రాలేదా? అనే కీలక విషయాలను కూడా ఆయన వివరించారు.
ఇవీ కారణాలు..
+ అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం.. చేరవలసిన గమ్యస్థానానికి 50 మీటర్ల దూరంలో అదుపు తప్పింది.
+ దీనికి కారణం.. దట్టమైన మంచు కారణంగా పైలట్‌కు విజిబిలిటీ కనించలేదు.
+ దీంతో కొద్దిసేపు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది.
+ ఇక, చక్కర్ల అనంతరం మరోసారి ల్యాండింగ్‌కు విమాన సిబ్బంది ప్రయత్నించారు.
+ ఆ సమయంలో విజిబిలిటీ విషయంలో పైలెట్ సానుకూలంగానే రియాక్ట్ అయ్యారు. దీంతో ల్యాండింగ్‌కు క్లియరెన్స్ ఇచ్చారు.
+ కానీ.. కొద్ది సేపటికే విమానం కుప్పకూలి.. మంటల్లో తగలబడి పోయింది.
+ రన్ వే కనిపించకపోవడంతో.. పైలెట్ విమానాన్ని బాగా కిందికి దింపారని.. ఈ సమయంలో రాయి తగిలిందని డీజీసీఏ అధికారులు గుర్తించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
+ పైలట్లు ఆపదలో ఉన్న సమయంలో చేసే మేడే కాల్స్ కూడా రాలేదన్నారు.
చివరి ట్వీట్ ఇదే..
విమాన ప్రమాదంలో మృతి చెందిన అజిత్ పవార్ బుధవారం ఉదయం విమానం ఎక్కుతున్న సమయంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదే ఆయన ఆఖరి పోస్టు అని కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగాజరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆయన సోషల్ మీడియాలో పేర్కొంటూ.. `మీ విశ్వసనీయ ప్రభుత్వం` తీసుకున్న నిర్ణయాలు ఇవే.. అంటూ ప్రజలకు వివరించారు. కాగా.. అజిత్ పవార్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన సతీమణి 2024 పార్లమెంటుఎన్నికల్లో బారామతి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం ఆమెను రాజ్యసభకు పంపించారు.