ప్రగతిభవన్‌ వద్ద ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం..ఎందుకంటే?

Update: 2020-09-18 08:30 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ప్రగతిభవన్‌ గేటు వద్ద ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి తెగబడ్డాడు. దీనితో వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై  ఆటో డ్రైవర్ ‌ను ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు. కిరోసిన్‌ పోసుకున్న అతడిపై నీళ్లు పోసి రక్షించారు. తెలంగాణ కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యాయత్నం చేశానని బాధితుడు తన భాదని వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు ఇల్లు కూడా మంజూరు చేయలేదంటూ నినాదాలు చేశాడు. ఆత్మహత్య యత్నం చేసిన ఆ ఆటోడ్రైవర్‌ను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇకపోతే , గత కొన్నిరోజుల రవీంద్ర భారతి వద్ద కూడా ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రవీంద్ర భారతి సమీపంలోని కమాత్ హోటల్ వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తెలంగాణ వచ్చిన తరువాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటూ నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడ్ని గుర్తించిన స్థానికులు పోలీసులు మంటల్ని ఆర్పివేసి ఆస్పత్రికి తరలించారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి జై తెలంగాణ, కేసీఆర్ సారు అంటూ పెద్దగా అరుపులు పెట్టాడు. జై తెలంగాణ అంటూ నినాదాల వర్షం కురిపించాడు.
Tags:    

Similar News