ఆస్ట్రేలియా ‘అప్పడం’ సాంగ్ అదిరిపోయింది.. చూశారంటే పొట్ట చెక్కలే!
ఎప్పుడో చిత్రీకరించిన ఓ వీడియో ఉన్నట్టుండి వైరల్ కావడం.. సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్ కావడం చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి 2014లో అప్పడాలపై ఓ వీడియోను రూపొందించారు. అది ఉన్నట్టుండి ఎవరో ఓ వ్యక్తి కంటబడింది. దీంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నది. ‘అప్పడాల గురించి ఇంత క్రియేటివ్ యాడ్‌ను ఇప్పటి వరకు చూడలేదు బాబోయ్’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ పాట మొత్తంలో అప్పడం అని తప్ప మరో పదం ఉపయోగించకపోవడం మరో విశేషం. భారతీయుల్లా దుస్తులు ధరించిన ఆస్ట్రేలియన్లు అప్పడాలు పట్టుకుని.. డ్యాన్స్ చేయడం నిజంగా ఫన్నీగా అనిపిస్తుంది. అయితే, ఈ ప్రకటన ఎవరి కోసం.. ఎందుకు చేశారో తెలీదుగానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పడు వైరల్ అవుతుంది.
ఈ వీడియో సాంగ్ వైరల్ కావడంతో.. వీడియో రూపొందించిన ఆంథోనీ ఫీల్డ్ అనే వ్యక్తి స్పందించాడు. ‘ఈ పాటను రాసింది. డైరెక్ట్ చేసింది నేనే. దీన్ని 2014లో చిత్రీకరించాను. ఓ ఇండియన్ వేడుక కోసం దీన్ని చిత్రీకరించాం. భారత సంస్కృతిని కించపరిచే ఉద్దేశంతో దీన్ని చేయలేదు. ఎవరినైనా నొప్పించి ఉంటే.. క్షమించండి’ అని ఆయన పేర్కొన్నారు. అతడి వివరణపై కూడా కామెంట్లు వచ్చి పడ్డాయి. ‘అందులో ఏం లిరిక్స్ ఉందని నువ్వు రాశావు నాయనా’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. నిజానికి ఆ పాటలో ‘అప్పడం అప్పడం’ తప్ప వేరే పదమే లేదు. ఆ పాటలో నటించిన ఓ భారతీయ మహిళ.. చివరి వరకు నవ్వుతూనే ఉంది.. దీనిపై కూడా ట్రోలర్స్ ఓ రేంజ్లో స్పందిస్తున్నారు. ‘ అమ్మ బాబోయ్.. ఇది టూత్‌పేస్ట్ యాడ్ కాదు తల్లీ.. అప్పడం యాడ్.. కొంచెం చూసుకో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.