మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2020-11-29 13:30 GMT
ముక్కు మీద కోపం ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ.. అదంతా పాల పొంగు లాంటిదే తప్పించి..మరొకటి కాదు. భరోసాగా మాట్లాడటం.. కష్టంలో ఉన్నారంటూ ముందుకొచ్చి ఆదుకునే తీరు మంత్రి పేర్ని నాని సొంతం. అలాంటి ఆయనపై దాడికి యత్నించిన వైనం షాకింగ్ గా మారింది.

క్రిష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఆయన నివాసంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు విస్తుపోయేలా చేస్తోంది. మంత్రి ఇంటికి వచ్చిన దుండగుడు.. ఆయనపై దాడికి యత్నించి..చంపాలని ప్రయత్నించటం సంచలనంగా మారింది. తాపీతో మంత్రి మీదకు దాడికి ప్రయత్నించిన దుండగుడ్ని.. ఆయన అనుసరులు పట్టుకున్నారు. దీంతో.. పేర్ని నానికి తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది.

ఊహించని ఈ పరిణామానికి అక్కడి వారంతా షాక్ తిన్నారు. ఆ వెంటనే తేరుకొని.. అతడ్ని బలంగా పట్టేసుకొని.. ఒక చోట ఉంచారు. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. మంత్రిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆ దుండగుడు ఎవరు? ఎందుకిలా చేశాడు? అతని వెనుక ఎవరైనా ఉన్నారా? లాంటి వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Tags:    

Similar News