దారుణంః యువ‌కుడి మ‌ర్మాంగాల‌ను క‌త్తిరించారు!

Update: 2021-04-13 23:30 GMT
ఉత్త‌ర ప్ర‌దేశ్ లో మ‌రో దారుణం జ‌రిగింది. ఉన్నావ్‌, హ‌త్రాస్ ఘ‌ట‌న‌ల్లో దారుణంగా అమ్మాయిల‌ను హ‌త్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ యువ‌కుడు బాధితుడు అయ్యాడు. అతడి మ‌ర్మాంగాల‌ను క‌త్తిరించారు ఇద్ద‌రు నంపుస‌కులు.

ఆగ్రాలో ఇద్ద‌రు నంపుస‌కులు పెళ్లి బ‌రాత్ లో డ్యాన్స్ చేస్తూ.. వ‌చ్చిన డ‌బ్బుతో జీవ‌నం సాగిస్తుంటారు. అయితే.. డ‌బ్బు అవ‌స‌రం కావ‌డంతో ఓ యువ‌కుడు వారితో క‌లిసి ఓ బ‌రాత్ లో డ్యాన్స్ చేసేందుకు వెళ్లాడు. అయితే.. ఇంటి నుంచి వెళ్లిన‌ రెండు రోజుల త‌ర్వాత.. తీవ్ర గాయాల‌తో ఇల్లు చేరాడు.

బాధితున్ని చూసి కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఏం జ‌రిగింద‌ని ఆరాతీయ‌గా.. నంపుస‌కులు మ‌ర్మాంగాల‌ను క‌త్తిరించిన విష‌యం వెల్ల‌డించాడు. దీంతో.. కుటుంబ స‌భ్యులు ఢిల్లీ గేట్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. 326 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధిత యువ‌కుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
Tags:    

Similar News