హైదరాబాద్ లో దారుణం.. భర్త అప్పు తీర్చలేదని భార్యను చంపారు
హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. భర్త చేసిన తప్పు భార్య ప్రాణాలు పోయేలా చేసింది. ఈ ఉదంతానికి సంబంధించిన ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిమళ్ కుమార్ అనే వ్యక్తి మెడికల్ బిజినెస్ చేసేవాడు. తెలిసిన వారి వద్ద రూ.30లక్షలు అప్పు చేశారు.
రెండేళ్లు అవుతున్నా.. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదు. దీంతో.. అప్పు ఇచ్చిన వారు పరిమళ్ తండ్రి దినేశ్ ను అడిగారు. అయినా.. అతని నుంచి స్పందన లేదు. ఇదిలా ఉండగా.. ఏడాది క్రితం పరిమళ్ కనిపించకుండా పోయాడు. అప్పుల వారి బాధను తప్పించుకోవటానికి ఉన్న ఇంటిని ఖాళీ చేసి.. వేరే ఇంటికి మారాడు.
ఈ విషయం తెలుసుకున్న అప్పు ఇచ్చిన వారు పరిమళ్ కొత్తింటికి వచ్చారు. వారు వచ్చే వేళకు.. పరిమళ్ భార్య మంజుల (45).. ఇద్దరు పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అప్పు గొడవ ఇంట్లో పిల్లలకు.. అపార్ట్ మెంట్ వాసులకు తెలిస్తే బాగోదన్న ఉద్దేశంతో.. వారిని తీసుకొని కిందకు వచ్చింది.
తన భర్త తనతో ఉండటం లేదని.. అతని సమాచారం తనకు తెలీదని ఆమె చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇమ్రాన్ (అప్పు ఇచ్చిన వ్యక్తి మనిషి) కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చారు. ఘటనా స్థలంలోనే ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. మహిళ హత్యకు కారణమైన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భర్త అప్పు చేయటం ఏమిటి? భార్య ప్రాణాలు పోగొట్టుకోవటం ఏమిటో.. దారుణం కదూ?