చరిత్రలో కలిసిన ఒక జ్ఞాపకం.!

Update: 2020-06-05 06:15 GMT
ఓ 20 క్రితం పెళ్లి జరుగుతోందంటే.. కట్నంగా సైకిల్ పెట్టడం ఆనవాయితీ.. ఇప్పుడు బైక్ పెడుతున్నారనుకోండి.. కానీ ఆ నాటి రోజుల్లో సైకిలే గొప్ప..  కరోనా-లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు వలస కూలీలు సొంతూళ్లకు సైకిళ్లతో వెళుతూ కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు నిజంగానే నాటి ఫేమస్ సైకిల్ కనుమరుగైపోయింది.

అట్లాస్.. మన దేశంలోనే ప్రముఖ సైకిల్ బ్రాండ్. పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం వరకు సైకిల్ తొక్కే వారందరికీ ఈ పేరు సుపరిచితమే.. దాదాపు ప్రతీ ఇంట్లో ఓ అట్లాస్ సైకిల్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

అయితే అలాంటి ప్రముఖ బ్రాండ్ సైకిల్ లాక్ డౌన్ తో కనుమరుగైంది. ఇక నుంచి ఆ సైకిల్ ఉత్పత్తి జరగదు.  లాక్ డౌన్ వల్ల ఈ సైకిళ్ల ఉత్పత్తికి బ్రేక్ పడింది.

అట్లాస్ కంపెనీ తమ తయారీ ప్లాంట్ ను మూసి వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్నామని.. కనీసం ముడి పదార్థాలు సైతం కొనే పరిస్థితి లేదని ఆ కంపెనీ ప్రకటించింది.
Tags:    

Similar News