టీడీపీ వెరీ వీక్ గురూ ... ఆ రెండు పార్టీల అంచనా... ?
తెలుగుదేశం పార్టీని దేశంలోనే క్యాడర్ బేస్డ్ గా అంతా గుర్తిస్తారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు. వారు కూడా లక్షల్లో ఉన్నారు. ఇక పోలింగ్ బూత్ లెవెల్ నుంచి కూడా టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. నాలుగు దశాబ్దాల చరిత్ర టీడీపీది. ఇక బలమైన సామాజిక వర్గాలు కొన్ని టీడీపీనే అట్టిపెట్టుకుని దశాబ్దాలుగా రాజకీయాలు చేశాయి. టీడీపీని పెంచి తామూ కూడా ఎదిగాయి.
అటువంటి టీడీపీ వీక్ అంటే ఎవరైనా నమ్ముతారా. అయితే అది ఏమంత ఆశ్చర్యపోయే విషయం కాదు. దానికి స్పష్టమైన ఉదాహరణ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీనే. ఏపీలో కాంగ్రెస్ 2014 ముందు దాకా చాలా గట్టిగానే ఉండేది.
ఒకే ఒక్క విభజన దెబ్బ కాంగ్రెస్ ని కకావికలం చేసి పారేసింది. ఇపుడు కాంగ్రెస్ ఏపీలో ఎంతటి దయనీయమైన స్థితిలో ఉంది అంటే మొత్తం 175 సీట్లలో డిపాజిట్లు వచ్చే సీటు ఇదీ అని కూడా చెప్పలేని స్థితి.
మరో ఉదాహరణగా తీసుకుంటే పశ్చిమ బెంగాల్ ని కూడా చెప్పుకోవాలి. అక్కడ సీపీఎం దశాబ్దాల పాటు ఏకధాటిగా ఏలింది. బలమైన పార్టీగా నిలిచింది. అలాంటి పార్టీ కూడా గత రెండు ఎన్నికల నుంచి బాగా తగ్గిపోయింది. వీటితో పాటు తెలుగుదేశాన్నే తీసుకుంటే తెలంగాణాలో పుట్టిన ఆ పార్టీ ఈ రోజు అక్కడ ఉనికి పోరాటం ఎలా చేస్తోందో అందరికీ తెలుసు.
అయితే టీడీపీకి కొన్ని బలమైన మూలాలు ఏపీలో ఉన్నాయి. అందువల్ల ఆ పార్టీ ఏపీ వరకూ పటిష్టంగానే ఉంది అని అంటారు. కానీ టీడీపీకి ఫ్యూచర్ లేదని రెండు పార్టీలు అంచనా కడుతున్నాయని టాక్.
అందులో మొదటిది బీజేపీ. ఏపీలో బీజేపీని విస్తరించాలని తాజాగా ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా బీజేపీ హై కమాండ్ ఆలోచనలు ఏంటి అంటే ఏపీలో టీడీపీ బాగా వీక్ అయిందనిట.
ఏపీలో క్షేత్ర స్థాయిలో టీడీపీ గ్రాఫ్ బాగా పడిపోతోంది అన్న అంచనాకు కమలనాధులు వచ్చారట. ఆ ప్లేస్ ని అందిపుచ్చుకుని బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ నేతలకు గట్టిగా ఆదేశాలు ఇచ్చారట.
ఏపీలో టీడీపీకి నాయకత్వ లోపం ఉండడం, చంద్రబాబు తరువాత ఎవరు లీడర్ అన్న నిలువెత్తు ప్రశ్న ముందుకు రావడం, ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో మాదిరిగా క్యాడర్ కూడా పెద్దగా బయటకు రాని స్థితి. వారు డీమోరలైజ్ అవుతున్న క్రమాన్ని పసిగడుతున్న బీజేపీ ఏపీలో కష్టపడితే అద్భుతమైన స్పేస్ బీజేపీకి ఉంటుందని బాగానే లెక్కలు వేస్తోందిట.
ఇక మరో పార్టీగా జనసేన కూడా కూడా టీడీపీ మీద ఇదే రకమైన అభిప్రాయంతో ఉండడం విశేషం. టీడీపీని పవన్ పెద్దగా విమర్శించకపోవడం వెనక ఆయన రాజకీయ వ్యూహాలే కారణం అంటున్నారు.
జగన్ యువకుడు. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉండడమే కాకుండా వైసీపీని కూడా ధీటుగా ఉంచుతారు. అదే సమయంలో టీడీపీలో చంద్రబాబు వయోభారంతో ఉన్నారు. ఆయన వారసుడు లోకేష్ మీద ఎవరికీ నమ్మకాలు లేవు, ఇక జూనియర్ ఎన్టీయార్ సైతం రాజకీయాలోకి ఇప్పట్లో రారు అన్న లెక్కలు ఉన్నాయి.
దాంతో వైసీపీని ఎంత గట్టిగా ఢీ కొడితే అంతలా ఆల్టర్నేషన్ పార్టీగా ఏపీలో జనసేన ఎస్టాబ్లిష్ అవవచ్చు అన్న మాస్టర్ ప్లాన్ తోనే పవన్ ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆయన టీడీపీని పక్కన పెట్టి అసలైన ప్రత్యర్ధిగా వైసీపీని చూస్తున్నారు అంటున్నారు. మొత్తానికి టీడీపీ అధినాయకత్వం మిత్రులుగా జనసేనను, బీజేపీని చూడాలనుకుంటోంది.
కానీ ఆ రెండు పార్టీలు అయితే టీడీపీ ఎంత త్వరగా ఏపీలో రాజకీయ జాగా ఖాళీ చేస్తే అందులో కుదురుకుపోవాలని బాగానే ఆశపడుతున్నాయి. ఇంతకీ టీడీపీ మరీ అంతా వీకా అంటే దానికి కాలమే జవాబు చెప్పాలి.