హిజ్రాపై హత్యాయత్నం.. పెట్రోలు పోసి తగలబెట్టిన మరో హిజ్రా వర్గం
ఒక హిజ్రా వర్గం మరో హిజ్రా పై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణ సంఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ముందుగా ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్త పెద్దదై వర్గం వరకు వెళ్లి అది హత్యాయత్నానికి దారితీసింది ఒక హిజ్రా పై పెట్రోల్ పోసి తగలబెట్టడంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎర్రగడ్డ అవంతి నగర్ కు చెందిన హరి ప్రసాద్ అలియాస్ హంస (28)కు ఇటీవల చందా నగర్ కు చెందిన హిజ్రాల తో గొడవలు వచ్చాయి.
సమస్య పరిష్కరించుకుందామని.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోకి రావాలని కొందరు హిజ్రాలు హంసకు కబురు పెట్టారు. ఆమె ఒంటరిగా అక్కడికి వెళ్లడంతో మరో వర్గం ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టింది. మంటల్లో కాలుతున్న హంస ను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒల్లంతా కాలడంతో హంస ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆమె ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలోనే ఉంది. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హిజ్రాల మధ్య గొడవ చెలరేగి ఏకంగా పెట్రోల్ పోసి తగల పెట్టడం హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది.