బదిలీ చేశారని పెట్రోల్ పోసుకొని ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

Update: 2019-11-22 11:58 GMT
తెలంగాణ పోలీస్ శాఖలో  కలకలం చోటు చేసుకుంది. ఉన్నతాధికారి వేధింపులు తట్టుకోలేక ఓ ఏఎస్సై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. తీవ్రంగా గాయపడ్డ ఏఎస్సై ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.

బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా నరసింహ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే నరసింహా బాలాపూర్ పీఎస్ నుంచి మంచాలా పీఎస్ కు అక్కడి ఏరియా సీఐ బదిలీ చేశారు. అయితే బదిలీపై వెళ్లడం ఇష్టం లేని నరసింహా సీఐని కలిసి తన బదిలీ నిలిపివేయాలంటూ వేడుకున్నాడు. అయితే సీఐ అందుకు అంగీకరించలేదు.

దీంతో సీఐ వేధింపులు, బదిలీ కాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఏఎస్సై నరసింహ బాలాపూర్ పీఎస్ సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు. తన ఆత్మహత్యకు సీఐయే కారణమని నినాదాలు చేస్తూ ఆరోపించాడు.

ఇక కాలిపోతున్న ఏఎస్సై నరసింహను తోటి పోలీసులు గుర్తించి వాటర్ ట్యాంక్ ఎక్కి మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. ఏఎస్సై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఐ బదిలీ చేయడం.. వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు ఏఎస్సై నరసింహులు ఆస్పత్రిలో వాంగ్మూలం ఇచ్చాడు.
Tags:    

Similar News