ఆశుతోష్ మిశ్రా పీఆర్సీ రిపోర్టు చూస్తే.. హమ్మ జగనా? అనుకోవాల్సిందేనట
పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. ఉద్యోగ సంఘాలు తమ హక్కుఅయిన పీఆర్సీ కోసం పోరాటం చేయటం తెలిసిందే.
పీఆర్సీపై జరిగిన చర్చల సందర్భంగా 11వ పీఆర్సీ నివేదికకు సంబంధించి ఆశుతోష్ మిశ్రా రిపోర్టును బయటకు ఇవ్వాలని ఉద్యోగులు ఎంత అడిగినా బయటపెట్టింది లేదు. ఈ రిపోర్టు కోసం ఎంతోకాలం ఎదురుచూశారు కూడా. అయితే.. పీఆర్సీ ఇష్యూ మొత్తం ఒక కొలిక్కి వచ్చి.. ఉద్యోగ సంఘాల కారణంగా తాము నష్టపోయామన్న భావన ప్రభుత్వ ఉద్యోగుల్లో పెరుగుతున్న వేళ.. ఆశుతోష్ మిశ్రా పీఆర్సీ రిపోర్టు బయటకు రావటం.. అందులో పేర్కొన్న అంశాలు షాకింగ్ గా మారాయి.
ఎందుకంటే.. మూలవేతనంపై 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని రిపోర్టులో సిఫార్సు చేశారు. కానీ.. ప్రభుత్వం ఈ నివేదికను బయటకు తీసుకురాకుండా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి.. 23 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేయటం తెలిసిందే. అంటే.. సిఫార్సుల కంటే తక్కువగా ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినట్లైంది. అంతేకాదు.. హెచ్ఆర్.. సీసీఏకు సంబంధించిన రిపోర్టులో పేర్కొన్న విషయాలకు.. ప్రభుత్వం నిర్ణయించిన దానికి మధ్య ఉన్న అంతరం ఇప్పుడు వేదనకు గురి చేసేలా మారింది.
తాము కోరిన దానికి భిన్నంగా.. అరకొర సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం.. దానికే ప్రభుత్వం మీద భారీ భారం పడుతుందన్న ప్రచారం చేసింది. ఆశుతోష్ మిశ్రా రిపోర్టులో అయితే.. 27 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి.. ఇంటి అద్దె భత్యాల్ని తగ్గించకుండా.. సీసీఏను కొనసాగిస్తూ.. మరిన్ని వెసులుబాట్లు.. ప్రయోజనాలు కల్పిస్తూ సిఫార్సులతో ప్రభుత్వం మీద పడే ఆర్థిక భారం రూ.3181 కోట్లు మాత్రమేనని కమిటీ పేర్కొంది.
అంతేకాదు.. ఇంటి అద్దె భత్యాల్ని కొనసాస్తూ.. 10 లక్షలకు పైగా జనాబా ఉన్న నగరాల్లో పని చేసే వారికి 22 శాతం అద్దె భత్యం ఇవ్వాలని కొత్త కేటగిరిని ప్రతిపాదించింది. అదేమీ ప్రభుత్వం నిర్ణయించిన దానిలో లేదు. నిజానికి ప్రభుత్వం 23 శాతం ఫిట్ మెంట్ డిసైడ్ చేసి.. హెచ్ఆర్ఏ మీద ఇచ్చిన జీవోలపై ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసి.. సమ్మె నోటీసులు ఇవ్వటం.. ఆ సందర్భంగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే.
లక్షలాదిగా ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేయటంతో.. వారిని చల్లార్చేందుకు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. వారు డిమాండ్లకు కోత పెట్టి ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు అమలు చేస్తున్న దానికి.. ఆశుతోష్ మిశ్రా నివేదికలో ప్రతిపాదించిన అంశాలకు పోలికే లేదంటున్నారు. ఈ రిపోర్టును అమలు చేసి ఉంటే.. ఉద్యోగులకు మేలు జరిగేదంటున్నారు. ఇంతకూ మిశ్రా నివేదికలో ఏముందన్నది చూస్తే..
- అశుతోష్ మిశ్రా కమిటీ చేసిన సిఫార్సుల్లో కనీస వేతనం రూ.20 వేలుగా ఉంది.
- వేతన స్కేళ్లు 32 గ్రేడులు, 83 స్టేజీలతో మాస్టర్ స్కేళ్లు. (గతంలో 81గా ఉన్న స్టేజీల సంఖ్య 83కి పెంచారు)
- వార్షిక ఇంక్రిమెంట్ తొలి స్టేజీల్లో 3% నుంచి మొదలుపెట్టి 2.34%తో ముగిసేలా సిఫార్సు.
- కనీస వేతనం రూ.20వేలు చెల్లించాలి. గరిష్ఠ వేతనం రూ.1.79 లక్షలు ఉండాలని సిఫార్సులు.
హెచ్ఆర్ఏ అంశంలోనూ నివేదిక ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు మూలవేతనంపై 30%, నెలకు రూ.26 వేలకు మించకుండా ఇవ్వాలని ప్రతిపాదించింది.
- 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 22%, నెలకు రూ.22,500 మించకుండా సిఫార్సు.
- 2-10 లక్షలు జనాభా కలిగిన నగరాల్లో పనిచేసే వారికి మూలవేతనంపై 20%, నెలకు రూ.20,000 మించకుండా చూడాలంటూ సిఫార్సు
- 50 వేలు-2 లక్షల లోపు జనాభా కలిగి నగరాల్లో ఉద్యోగులకు.. మూలవేతనంపై 14.5%, నెలకు రూ.20,000 మించకుండా ఇవ్వాలి.
- మిగిలిన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 12%, నెలకు రూ.17,000 మించకుండా హెచ్ఆర్ఏ అమలుకు సిఫార్సు.