నిధుల కోసం పార్టీలు ఏర్పాటు చేయమన్న సీఎం

Update: 2019-12-12 10:54 GMT
దేశంలోని రాష్ట్రాలకు కాస్త భిన్నమైన రాష్ట్రంగా ఢిల్లీని చెప్పాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే వారిది సిత్రమైన పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల్లోని సీఎంల మాదిరి వారికి పవర్స్ ఉండవు. అలా అని.. లేకుండానూ ఉండవు. ఉన్నాయంటే ఉన్నాయన్నట్లుగా ఉంటాయి. చాలా పరిమితుల మధ్య ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. సాక్ష్యాత్తు కేంద్రప్రభుత్వం కొలువు తీరి ఉండే ఢిల్లీలో.. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ‘సీన్’ మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల కంటే చాలా తక్కువ.

దీంతో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందునా కేంద్రంలోని ప్రభుత్వానికి ప్రత్యర్థి పార్టీకి ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు ఉండే ఆ ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ది కూడా ఇలాంటి పరిస్థితే.

ప్రతికూలతల మధ్య ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మొదటల్లోనే ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీని నడిపించటానికి అవసరమైన నిధులు లేని నేపథ్యంలో తమకు బాగా అలవాటైన ఐడియాను ఈసారి కూడా వాడేయాలని డిసైడ్ అయ్యారు.

ఢిల్లీ అధికారపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ నిధుల సేకరణ కోసం పెద్ద ఎత్తున టీ.. లంచ్.. డిన్నర్ ప్రోగ్రాంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన పార్టీ నేతలకు సూచనలు చేశారు. వీలైనన్ని పార్టీలు ఇవ్వటం ద్వారా విరాళాలు సేకరించాలని.. నిధుల సేకరణకు పార్టీలు నిర్వహించటమే మంచిదని సీఎం కేజ్రీవాల్ చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విరాళాల్ని పెద్ద ఎత్తున సేకరించేందుకు ఆమ్ ఆద్మీ తన శక్తియుక్తుల్నిసమీకరిస్తోంది. మరీ ప్రయత్నంలో ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.

    

Tags:    

Similar News