లగ్జరీ దొంగలు .. విమానంలో వచ్చి ఏటీఎం దోచేస్తారు , ఆ తర్వాత ఏంచేస్తారంటే ?
దొంగలు కూడా టెక్నాలజీతో చాలా ఈజీగా దొంగతనం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి , లగ్జరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. విమానంలో వస్తారు , చాలా కూల్ గా ఏటీఎం దోచేస్తారు , మళ్లీ విమానం ఎక్కి హాయిగా వెళ్ళిపోతారు. ఈ తరహాలో దొంగతనం చేస్తూ ఎవ్వరికీ దొరక్కుండా వెళ్తున్న లగ్జరీ దొంగల గుట్టుని విశాఖ పోలీసులు కేవలం 34 గంటల్లోనే బయటపెట్టారు.
ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఈనెల 22వ తారీకున విశాఖపట్నం ఆరిలోవ సుందర్ నగర్‌లోని ఏటీఎం లో చోరీ జరిగింది. ఈ కేసును పోలీసులు కేవలం 34 గంటల్లోనే ఛేదించారు. పక్క రాష్ట్రం నుండి విమానంలో వచ్చి మరీ ఈ ఏటీఎంను చోరీ చేసి మళ్లీ అక్కడ నుండి విమానంలోనే బెంగళూరుకు దొంగలు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు టెక్నాలజీ మరియు తెలివిని వాడి చాలా ఈజీగా దొంగలను కనిపెట్టారు. చోరీ చేసింది పాత నేరస్థులైన పంజాబ్ కు చెందిన సమర్ జ్యోతి సింగ్, కేరళకు చెందిన జాఫర్ సాధిక్ లుగా గుర్తించారు. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో వీరికి పరిచయం ఏర్పడినట్లు గుర్తించారు. అప్పుడే చోరీలకు స్కెచ్ గీశారు.
అందులో భాగంగానే .. హైదరాబాద్ నుండి వైజాగ్ కు విమానంలో ఈనెల 16వ తారీకున చేరుకున్నారు. నాలుగు రోజులు అనేక ప్రాంతాలు తిరిగి చివరకు సుందర్ నగర్‌లోని ఏటీఎంను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ముందస్తు ప్లానింగ్ చాలా చేసుకున్నారు.డబ్బులు వేసిన రోజు రాత్రి వెంటనే చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను గ్యాస్ కట్టర్ తీసుకుని వెళ్తారు. 22వ తారీకు రాత్రి సమయంలో సమరజ్యోతి లోనికి వెళ్లి గ్యాస్ కట్టర్ తో కట్ చేసి ఏటీఎం దొంగతనం చేయగా, సాదిక్ బయట ఎవరు రాకుండా చూశాడు. ఇద్దరు కలిసి 9.59 లక్షల రూపాయలను చోరీ చేశారు. పని పూర్తయిన తర్వాత ఇద్దరూ హోటల్ కుచేరుకొని .. ఫ్లైట్‌లో సింపుల్ గా బెంగళూరు చెక్కేశారు. అయితే , పోలీసులు సీసీ కెమెరాల ఆదారంగా కేసును ఛేదించారు. వారిద్దరిని పోలీసులు బెంగళూరులో ఒక హోటల్ లో పట్టుకున్నారు.గతంలో హైదరాబాద్ లోని కూకట్ పల్లి, మాదాపూర్, బెంగుళూరులో 2 ATMలు దోచుకున్నట్లు గుర్తించారు. లగ్జరీగా బతకడం వీరిద్దరికీ ఇష్టమని అందుకే రిస్క్ లేకుండా ATMలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. కేవలం టాటా కంపెనీ మెయింటైన్ చేస్తున్న ఏటీఎంలలోనే దొంగతనం చేయడం ఈ కేసులో అంతుచిక్కని అంశం.