మతం మారితే కేసుల నుంచి ఫ్రీ?

Update: 2016-07-24 10:35 GMT
మతమార్పిడులు కొత్త కానప్పటికీ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 800 మందిని ఇస్లాంలకు మార్చటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఇస్లాంలో మార్చిన ఇద్దరిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలామతం మార్చే వారు.. ముంబయిలో మరింత మంది ఉన్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అర్షిద్ ఖురేషి.. రిజ్వాన్ ఖాన్ లు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు మతస్తులను ఇస్లాంలోకి మార్చినట్లు గుర్తించారు.

దీనికి సంబంధించి కొన్ని పత్రాల్ని.. పెళ్లి ధ్రువపత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. వీరు చెబుతున్న మాటల ప్రకారం దాదాపు 800 మంది కంటే ఎక్కువ మంది హిందువులు.. క్రిస్టియన్లను హిందూ మతంలోకి మారుస్తూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. పోలీసుల కస్టడీలో ఉన్న రిజ్వాన్ మాత్రం తాము ఎవరినీ బలవంతంగా మతం మార్చలేదని చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఇక.. మత మార్పిడులు ఎలా సాధ్యమవుతున్నాయన్న అంశంపై దృష్టిసారించిన పోలీసులకు ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. కాలేజీ విద్యార్థులు..జైల్లో పరిచయాలతో మతమార్పిడులకు పాల్పడుతున్నట్లుగా చెబుతున్నారు.వివిధ కేసుల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసుకొస్తున్నట్లుగా ప్రయత్నిస్తూ...వారికి మత మార్పిడుల పట్ల ఆసక్తి పెరిగేలా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక..మత మార్పిడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మాత్రం తాము బలవంతపు మార్పిడులకు పాల్పడటం లేదని.. ఈ వ్యవహారంలో తమకు సంబంధం లేదని చెబుతున్నారు.
Tags:    

Similar News