మహమ్మారి దెబ్బకు నొప్పులు మటుమాయం

Update: 2020-10-06 00:30 GMT
కరోనా వస్తే దగ్గు,జలుబు, జ్వరం, వొళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని ఇప్పటి వరకూ మనం విన్నాం. అయితే కరోనా సోకిన వాళ్ళల్లో హఠాత్తుగా  నొప్పులు మటు మాయం అవుతున్నయంటా. నిజంగా ఇది నిజమేనని పరిశోధకులు  కూడా తేలుస్తున్నారు. కరోనా లక్షణాలు మొదలైన ముందు శరీరంలో విపరీతంగా నొప్పులు ఉంటాయని ఆ వైరస్ బారిన పడిన వారు చెబుతుంటారు. కానీ ఆ తరువాత వైరస్‌ కారణంగా నొప్పులు ఏమున్నా తగ్గిపోతాయని  పరిశోధకులు తేల్చారు. అందుకే కొంతమంది తమకసలు వ్యాధి లక్షణాలు లేవని, పాజిటివ్ ఎందుకు చూపిస్తుందో అర్థంకావడం లేదు అంటూ బయట తెగ తిరుగుతున్నారు. ఇందుకు కారణం ఒంట్లోకి చేరిన వైరసేనని, అది  క్రమేణా నొప్పులు ఏమైనా ఉంటే తగ్గేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డా కూడా 40 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దానికి ఇదే కారణమై ఉండొచ్చని తెలిపారు.

అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ విషయమై పరిశోధన చేశారు. కరోనా సోకిన వాళ్ళలో  40 శాతం కేసుల్లో వ్యాధి లక్షణాలు కనిపించడంలేదని , అందుకే వారు తమకు ఎలాంటి సమస్య లేదని భావిస్తూ బయట కూడా తిరుగుతున్నారని  రాజేశ్‌ ఖన్నా  అనే పరిశోధకుడు తెలిపారు. 'చాలామందికి కరోనా సోకగానే అది ఒంట్లోని నొప్పులను అణచివేతకు గురిచేస్తోంది. అందువల్లే వ్యాధి ప్రారంభ దశలో బాధితుడిలో ఎలాంటి లక్షణాలు ఉండటంలేదు. ఒంటి నొప్పులు కూడా  వ్యాధి లక్షణమే..కరోనా ప్రారంభ దశలో నొప్పులు ఉంటాయి. కానీ ఒంట్లో వైరస్ ప్రభావం మొదలు కాగానే  కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ నొప్పులను తగ్గేలా చేస్తోంది. శరీరంలోని నొప్పి సంకేతాలకు సంబంధించిన మార్గాలను ఇది నిశ్శబ్దం చేయడం వల్లే కరోనా వచ్చిన వాళ్ళలో కొందరికి నొప్పులు ఉండటం లేదు' అని రాజేశ్‌ ఖన్నా వివరించారు.
Tags:    

Similar News