ప్రపంచంలో టెస్ట్ ట్యూబ్ బేబీలు 80 లక్షల మంది పుట్టారా?

Update: 2021-02-15 13:30 GMT
ఈ భూమ్మీద ప్ర‌తీ జీవి సెక్స్ లో పాల్గొంటుంది. కానీ.. రెండు జీవుల సెక్స్ మాత్రం మిగిలిన ప్రాణ‌కోటికి భిన్నంగా ఉంటుంది. ఆ రెండిట్లో ఒక‌టి డాల్ఫిన్ కాగా.. రెండోది మ‌నిషి! అవును.. ఈ రెండు ప్రాణుల సంప‌ర్కం మిగిలిన జీవజాతికే భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే..? కాలం గురించి మ‌నం చెప్పుకునే రుతు క్ర‌మాన్ని అనుస‌రించి ఆ జీవులన్నీ ప్రత్యేక సందర్భంలోనే సెక్స్ లో పాల్గొంటాయి. అది కూడా కేవలం వాటి సంతతిని వృద్ధి చేసుకోవ‌డానికే. ఆ జీవుల్లో ఆడ ప్రాణి సంతానోత్ప‌త్తికి సిద్ధ‌మైన త‌ర్వాత ఇక‌, క‌ల‌యిక అనేది ఉండ‌దు. మ‌ళ్లీ ఆ సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడే లైంగికంగా ఒక్క‌ట‌వుతాయి. కానీ.. మ‌నుషులు అలా కాదు!

మ‌న‌సు కోరిన‌ప్పుడ‌ల్లా..
సంతానోత్ప‌త్తితో సంబంధం లేకుండా.. మ‌న‌సు కోరిన‌ప్పుడ‌ల్లా సెక్స్ కు సిద్ధ‌మ‌వుతాడు. ఈ క్ర‌మంలోనే అలా ఏడాదిలో ఎన్నిసార్లు లైంగికంగా ఒక్క‌టవుతారో తెలీదు. ఇంకా చెప్పాలంటే రోజులో ఎన్నిసార్లు క‌లుస్తారో చెప్ప‌లేం. డాల్ఫిన్ కూడా ఇదే త‌ర‌హా లైంగిక సుఖాన్ని అనుభ‌విస్తుంది. అయితే.. భ‌విష్య‌త్ లో రాబోతున్న చ‌ర్చ ఏమంటే.. సెక్స్ ఎందుకోసం? పునరుత్పత్తి కోసమా..? ఆనందం కోస‌మా??

మార్పు మొద‌లైంది..
లైంగిక ప్ర‌క్రియ‌లో ఏ స‌మ‌యంలో పాల్గొనాలి అనే అంశం నుంచి.. ఎవ‌రితో పాల్గొనాలి.. ఎందుకోసం పాల్గొనాలి అనే విష‌యం వ‌ర‌కూ మ‌నుషుల మ‌ధ్య చాలా వ్య‌త్యాసాలున్నాయి. ఇలా వేరుగా ఉండ‌డానికి కార‌ణం.. ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, క‌ట్టుబాట్లు కార‌ణం. అయితే.. అవ‌న్నీ క్ర‌మ‌క్ర‌మంగా మార్పు చెందుతున్నాయి.  'సెక్స్ ఎందుకోసం?' అనే ప్ర‌శ్న‌కు స‌మాధానంగానే ఈ మార్పులు జ‌రుగుతున్నాయ‌న్న విష‌యం లోతుగా ఆలోచిస్తే త‌ప్ప అర్థం కాదు.

పిల్ల‌ల‌ కోసమే అయితే..
'క‌న్న‌పేగు' వంటి సెంటిమెంట్ భావనలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా.. టెస్ట్ ట్యూబ్ బేబీలు పుట్టుకొస్తున్నారు. సరోగసి విధానం ద్వారా కూడా బిడ్డల్ని సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న టెస్ట్ ట్యూబ్ బేబీల సంఖ్య దాదాపు 80 లక్షల పైనే! ఈ లెక్క రాబోయే కాలంలో మ‌రింత వేగంగా పెరుగుతుంద‌నేది అంచ‌నా. సెక్స్ కేవ‌లం పిల్ల‌ల కోస‌మే అయిన‌ప్పుడు టెస్ట్ ట్యూబ్, స‌రోగ‌సీ బేబీలు ఈ స్థాయిలో పెర‌గాల్సిన అవ‌స‌రం ఉండ‌దన్న‌ది విశ్లేష‌ణ‌.

హెన్రీటి గ్రీలీ ఏమంటారంటే..?
సెక్స్ కేవ‌లం పిల్ల‌ల కోస‌మే కాదనే వారి సంఖ్య ఈ ప్రపంచంలో త‌క్కువేమీలేదు. అది అంత‌కు మించిన విష‌యం అని చెబుతుంటారు. దీనిపై 'ద ఎండ్ ఆఫ్ సెక్స్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్' పుస్తక రచయిత హెన్రీ టి గ్రీలీ ఏమంటారంటే... ''భవిష్యత్తులో కూడా ప్రజలు సెక్స్‌లో పాల్గొంటారు.. కానీ, పిల్లల్ని కనడం కోసమే శృంగారంలో పాల్గొనే వారి సంఖ్య మాత్రం తగ్గుతుంది'' అని! అంతేకాదు.. ''మరో 20 నుంచి 40 ఏళ్ళలో.. ప్రపంచంలో ఆరోగ్య బీమా అందుబాటులో ఉన్నవారిలో అత్యధికులు.. ల్యాబ్ ప్రెగ్నెన్సీలనే ఎంచుకుంటారు'' అని కూడా అన్నారు.

సెక్స్ ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది..
లైంగిక బంధం ఎవరి మధ్య ఉండాలి అంటే.. అపోజిట్ జెండర్ మధ్యనే అంటుంది మెజారిటీ ప్రపంచం. అపోజిట్ జెండర్లోనూ కులం, మతం, ప్రాంతం నుంచి మొదలు పెడితే.. ఆయా ప్రాంతాల్లో చాలా తేడాలు ఉన్నాయి. అయితే.. క్రమంగా ఈ ఆలోచనల్లో మార్పు వస్తోందంటున్నారు నిపుణులు. అన్నిటికంటే ముఖ్యంగా స్వలింగ సంపర్కం అనేది ఒక నేరంగా పరిగణిస్తుంది మెజారిటీ ప్రపంచం. కానీ.. దాన్ని కూడా చట్టబద్ధంగా గుర్తిస్తున్నాయి చాలా దేశాలు. ఈ విధంగా సెక్స్ కేవ‌లం కుటుంబం కోసం, పిల్ల‌ల కోసం మాత్ర‌మే కాద‌నే మార్పు వ‌స్తోందంటున్నారు విశ్లేష‌కులు.

అధ్య‌య‌నం చెప్తున్న వాస్త‌వాలు..
141 దేశాలలో సెక్స్ పట్ల ప్రజల వైఖరులలో వస్తున్న మార్పుల గురించి విలియమ్స్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఒక అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో, అంటే 57 శాతం దేశాలలో 1981- 2014 మధ్య ఎల్‌జీబీటీలకు ఆమోదం పెరిగిందని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే అన్ని చోట్లా అటువంటి మంచి మార్పులు జరగలేదు. మొదటి నుండి వీరిని ఆమోదిస్తూ వచ్చిన ఐస్‌ల్యాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్, అండోరా, నార్వేలలో ఈ ఆమోదం మరింత పెరిగింది. ఈ మార్పు సెక్స్ ఇలాగే ఉండాలి అని సృష్టించబడ్డ 'సంప్రదాయం'ను బద్ధలు కొడుతోందని చెబుతున్నారు.

భవిష్యత్ లో పిల్లలను కనరు..!
సెక్స్ ఆలోచ‌న‌ల్లో వ‌చ్చే మార్పు భ‌విష్య‌త్ లో మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నాన‌రు. 1978లో మొద‌లైన టెస్ట్ ట్యూబ్ బేబీల ప‌రంప‌రం.. ప్ర‌స్తుతం 80 లక్షలకు చేరింద‌ని, రానున్న రోజుల్లో ఇది మ‌రింతగా పెరుగుతుంద‌ని చెబుతున్నారు. పిల్లలు కావాలనుకునే జంటలు క్లినిక్‌కి వెళ్లి.. పురుషుడు కొన్ని వీర్య కణాలను.. స్త్రీ చిన్న చర్మపు తునకల‌ను ఇచ్చి వెళతారని ర‌చ‌యిత బ్రాండన్ అంబ్రోసినో అంటున్నారు. ఈ దంప‌తులు ఓ వారం పదిరోజుల తర్వాత వ‌చ్చే స‌రికి 100 పిండాలు సిద్ధంగా ఉంటాయ‌ని, ఆ పిండాలలోని జన్యువులను బ‌ట్టి, భవిష్యత్తులో పిల్ల‌లు ఎలా ఉంటారో తెలుసుకొని, త‌మ‌కు కావాల్సిన బిడ్డ‌ను ఎంచుకుంటార‌ని చెబుతున్నారు. ఇది ఎంతో దూరంలో లేదంటారు అంబ్రోసినో!

ఒకే భార్యాభ‌ర్త విష‌యంలోనూ మార్పు..
ఒక‌సారి జంట క‌డితే.. చ‌నిపోయే వ‌ర‌కూ ఇద్ద‌రూ క‌లిసే ఉండాల‌నేది మెజారిటీ స‌మాజం క‌ట్టుబాటు. కానీ.. ఇది కూడా రానున్న రోజుల్లో మారిపోతుంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. సెక్స్ అనేది ఆనందం కోసం జ‌రుపుకునే క్రియ‌. కానీ.. అది అంద‌న‌ప్పుడు భాగ‌స్వామి నుంచి విడ‌వ‌డేందుకు చూస్తారు. ఇప్పుడు చాలా దేశాల్లో ఆ ప‌రిస్థితి లేదుకాబ‌ట్టే.. అక్ర‌మ సంబంధాలు వంటివి పెచ్చు మీరుతున్నాయి. వాటి కార‌ణంగా జ‌రిగే ఘోరాలు కూడా చాలానే ఉంటాయి. అందుకే.. స్వేచ్ఛ‌గా భాగ‌స్వాముల‌ను ఎంచుకునే ప‌రిస్థితి కూడా వ‌స్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఒకే భాగ‌స్వామి అనేది కూడా మారుతుందని అంటున్నారు. ఈ ప‌రిస్థితి ఇప్ప‌టికే అమెరికాలో చాలా వేగంగా ఉంది. 2013 పీఈడబ్ల్యూ సర్వే ప్రకారం, ప్రతీ పది అమెరికన్ వివాహాల్లో నాలుగింటిని ప‌రిశీలిస్తే.. వారిలో ఒక‌రికి అది రెండో పెళ్లి అవుతోంది.

ఫైన‌ల్ గా సెక్స్ దేనికోసం..?
స్టార్టింగ్ లోనే చెప్పుకున్న‌ట్టుగా.. మ‌నుషుల్లో సెక్స్ అనేది ముందుగా మాన‌సిక ఆనందం కోస‌మే. ఆ త‌ర్వాతే పిల్ల‌లు, కుటుంబం ఇత‌ర‌త్రా. ఈ స్వేచ్ఛ‌కు తరాలుగా ప్ర‌పంచం 'క‌ట్టుబాట్లు' విధించింది. ఆ కారణంగానే వివాహేతర సంబంధాలు వంటి విపరీతాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాలను క్రమంగా అర్థం చేసుకుంటున్న ప్రపంచం.. సెక్స్ ప్రాధాన్యతను గుర్తిస్తోందని చెబుతున్నారు బ్రాండన్ అంబ్రోసినో. సెక్స్ అనేది కేవలం ఆనందం కోసం మాత్రమే అని ఈ లోకం అర్థం చేసుకోవడంతోపాటు దాన్ని ఆస్వాదిస్తుందని చెబుతున్నారు.
Tags:    

Similar News